'బెల్'లో ఉద్యోగాలు..

- October 14, 2021 , by Maagulf
\'బెల్\'లో ఉద్యోగాలు..

పంచకులలో ఉన్న భారత ప్రభుత్వ రక్షణ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్  పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 88 ప్రాజెక్ట్ ఇంజనీర్, 11 ట్రైనీ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్ధులకు రూ.25,000 జీతం నుంచి రూ.50,000 జీతం ఉంటుంది. ఈ పోస్టులకు ఇంజనీరింగ్ విద్యార్ధులు అర్హులు. ఎటువంటి పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేయనున్నారు. దరఖాస్తుకు ఆఖరు తేదీ అక్టోబర్ 27, 2021. పూర్తి సమాచారం కొరకు వెబ్‌సైట్ https://www.bel-india.in/Default.aspx ను సందర్శించాలి.

ముఖ్యమైన సమాచారం.. ప్రాజెక్ట్ ఇంజనీర్ : బీఈ/బీటెక్ చేసి ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి. మొదటి సంవత్సరం వేతనం రూ.35,000/- , రెండో సంవత్సరం వేతనం రూ.40,000/-, మూడో సంవత్సరం వేతనం రూ.45,000/-, నాలుగో సంవత్సరం వేతనం రూ.50,000/- ట్రైనీ ఇంజనీర్ : బీఈ/బీటెక్ చేసి ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి. మొదటి సంవత్సరం వేతనం రూ.25,000/- , రెండో సంవత్సరం వేతనం రూ.28,000/-, మూడో సంవత్సరం వేతనం రూ.31,000/- దరఖాస్తు ప్రారంభం : అక్టోబర్ 6, 2021

దరఖాస్తుకు చివరి తేదీ : అక్టోబర్ 27, 2021 దరఖాస్తు ఫీజు : ప్రాజెక్టు ఇంజనీర్ రూ.500, ట్రైనీ ఇంజనీర్ రూ.200 ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వారికి పరీక్ష ఫీజు లేదు ఎంపిక ప్రక్రియ.. దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు అకడమిక్ మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అభ్యర్ధుల అకడమిక్ సామర్ధ్యం, అనుభవం ఆధారంగా ఎంపిక జరుగుతుంది. అకడమిక్ మార్కులు 75 శాతం ఉండాలి. అనుభవానికి 10 శాతం మార్కులు, ఇంటర్వ్యూకి 15 శాతం మార్కులు ఉంటాయి.

దరఖాస్తు ప్రక్రియ.. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంటుంది. ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://www.bel-india.in/Default.aspx ను సందర్శించాలి. అనంతరం Careerలో రిక్రూట్‌మెంట్ విభాగంలోకి వెళ్లాలి. అనంతరం నోటిఫికేషన్ పూర్తిగా చదవాలి. తరువాత అప్లై ఆన్‌లైన్ బటన్‌పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తరువాత అప్లికేషన్ ఫారం ప్రింట్ తీసుకోవాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com