తైవాన్‌లో భారీ అగ్నిప్రమాదం, 46 మంది మృతి
- October 14, 2021
తైవాన్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.కాహ్సియుంగ్ నగరంలోని 13 అంతస్తుల ఓ భవనంలో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 46 మంది మృతి చెందగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. గురువారం(అక్టోబర్ 14) తెల్లవారుజామున 3గంటల సమయంలో ఈ అగ్నిప్రమాదం జరిగింది.
ప్రమాద సమయంలో తమకు భారీ పేలుడు శబ్దాలు వినిపించినట్లు స్థానికులు కొందరు వెల్లడించారు.ప్రమాద కారణాలేంటన్నది ఇంకా తెలియరాలేదు.ప్రమాద సమయంలో అగ్ని కీలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయని ఫైర్ సిబ్బంది తెలిపారు.
అగ్నిప్రమాద దృశ్యాలు పొరుగునే ఉన్న మరో బిల్డింగ్‌లోని సీసీటీవీలో రికార్డయ్యాయి. దాని ప్రకారం... మొదట ఆ భవనం మొదటి అంతస్తులోనే మంటలు చెలరేగాయి.ఆ తర్వాత క్షణాల్లోనే పై అంతస్తులకు మంటలు వ్యాపించాయి. తెల్లవారుజామున 3గం. సమయంలో ఫైర్ సిబ్బందికి ప్రమాదంపై సమాచారం అందింది. దీంతో వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆ భవనంలో మొత్తం 120 కుటుంబాలు నివసిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం 46 మంది మృతి చెందగా మరో 40 మందికి పైగా తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరారు. మిగతావారి పరిస్థితేంటన్నది ఇంకా తెలియాల్సి ఉంది.

తాజా వార్తలు
- ఆయు AIకి గూగుల్ ఫర్ స్టార్టప్స్ ఇండియా ప్రశంసలు.. గో-టు-మార్కెట్ మద్దతు
- జర్మనీ పర్యటన ముగించుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్
- ఏపీలో కొత్త లిక్కర్ పాలసీ..ఎక్సైజ్ శాఖ సంచలన నిర్ణయం..
- కేసులు కొట్టేస్తానని చంద్రబాబు కు జడ్జి హామీ: పేర్ని నాని
- అటవీ సిబ్బంది భద్రతకు ఆయుధాలు అవసరం.. పోలీసుల పూర్తి సహకారం: డీజీపీ సీవీ ఆనంద్
- యూఏఈతో పెట్టుబడి భాగస్వామ్యాలను బలోపేతం చేస్తున్న ఒడిశా..
- ఏపీలో వినాయక మండపాలకు ఉచిత విద్యుత్..మంత్రి గొట్టిపాటి ప్రకటన
- మద్రాస్ రెజిమెంట్‌లో చోరీపై సీవీ ఆనంద్ సంచలన వివరాలు
- 18 మంది ఆసియా వాసులను అక్రమంగా తరలించే ప్రయత్నం భగ్నం
- ఖైరతాబాద్ వినాయకుడి తొలి పూజకు రావాలని గవర్నర్‌కు ఉత్సవ కమిటీ ఆహ్వానం







