పాక్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన అమిత్ షా.!

- October 14, 2021 , by Maagulf
పాక్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన అమిత్ షా.!

గోవా: దేశ సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఆయుధాల తరలింపు, అక్రమ చొరబాట్లు, డ్రోన్ల ద్వారా దాడులకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే, భారత సైన్యం ఎప్పటికప్పుడూ వాటిని తిప్పికొడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ కు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గట్టి వార్నింగ్ ఇచ్చారు. సరిహద్దుల వద్ద ఉల్లంఘనలకు పాల్పడటం ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. మరోసారి సర్జికల్ స్టైక్స్ చేయాల్సి వస్తుందని చెప్పారు. తమ పౌరులపై దాడులను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని స్పష్టం చేశారు. భారత్ ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించదని అన్నారు. గోవాలోని ధర్‌బందోరాలో జరిగిన నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com