టీ20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్ ప్రారంభం
- October 17, 2021
మస్కట్: యూఏఈ, ఒమన్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 క్రికెట్ వరల్డ్ కప్ సంరంభం ప్రారంభమైంది. ఒమన్, పాపువా న్యూగినియా జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగుతోంది. అల్ అమేరత్ స్టేడియం ఆతిథ్యమిస్తున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఒమన్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది.
ఒమన్ తో పోల్చితే చాలా చిన్న జట్టయిన పాపువా న్యూగినియా సున్నా పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. స్కోరుబోర్డుపై పరుగులేమీ లేకుండానే ఓపెనర్లు టోనీ ఉరా, లెగా సియాకా పెవిలియన్ చేరారు. ఒమన్ బౌలర్లు బిలాల్ ఖాన్, కలీముల్లా చెరో వికెట్ తీశారు. ప్రస్తుతం క్రీజులో పాపువా న్యూగినియా కెప్టెన్ అసద్ వాలా, చార్లెస్ అమిని ఉన్నారు. ఆ జట్టు స్కోరు 3 ఓవర్లలో 2 వికెట్లకు 11 పరుగులు.
ఈ మెగా టోర్నీలో తొలి దశలో 8 జట్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ జరగనుంది. ఈ 8 జట్ల నుంచి అత్యధిక విజయాలు సాధించిన 4 జట్లు సూపర్-12 దశకు చేరుకుంటాయి. అక్కడ పెద్ద జట్లతో కలిసి మరోసారి రౌండ్ రాబిన్ లీగ్ ఆడతాయి.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







