25 భాషల్లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ వెబ్ సైట్..లాంచ్ చేసిన రామ్ చరణ్
- October 18, 2021మెగాస్టార్ చిరంజీవి ఏర్పాటు చేసిన 'చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్' ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగు తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా ఎంతో మంది సేవలు పొందారు. కరోనా సమయంలో సైతం చిరు తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారానే ఎంతోమందికి ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్స్ పంపించారు. ఇప్పుడు అదే పేరు మీద చిరు ఓ వెబ్ సైట్ ను ప్రారంభించారు. మొత్తం 25 భాషల్లో ఈ వెబ్ సైట్ అందుబాటులో ఉంది. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ఈ వెబ్ సైట్ ను లాంఛ్ చేశారు. ఈ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ సేవలు సైతం అందుబాటులోకి వచ్చాయి.
మరిన్ని ప్రాంతాలకు ట్రస్ట్ సేవల్ని విస్తరించాలనే ఉద్దేశంతోనే ఈ వెబ్ సైట్ ను ప్రారంభించినట్టు రామ్ చరణ్ తెలిపారు. చిరు చిత్రసీమలోకి అడుగుపెట్టి.. స్టార్ గా ఎదిగే క్రమంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి అందరికీ తెలిసేలా ఈ వెబ్ సైట్ ను ప్రారంభించినట్టు తెలుస్తోంది. kchiranjeevi.com పేరుతో ప్రస్తుతం ఈ వెబ్ సైట్ అందుబాటులో ఉంది. చిరంజీవి నటించిన 150 సినిమాల సమాచారం, పాటలు, దర్శక నిర్మాతలతో ఆయనకున్న రిలేషన్ గురించి సమాచారం ఇందులో లభ్యమవుతుంది.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్