విద్యుత్ సమస్య: హరామైన్ రైల్వే ట్రిప్పుల రద్దు

- October 18, 2021 , by Maagulf
విద్యుత్ సమస్య: హరామైన్ రైల్వే ట్రిప్పుల రద్దు

సౌదీ అరేబియా: అనూహ్యంగా తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా హరామైన్ హై స్పీడ్ రైల్వే సిస్టమ్ ఇబ్బందుల్ని ఎదుర్కొంది. 48 గంటలపాటు ఆయా ట్రిప్పుల్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు అధికారులు. విద్యుత్ సమస్య వల్లనే ఈ ఇబ్బంది తలెత్తిందనీ, దీన్ని సరిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామనీ ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామనీ అధికారులు తెలిపారు. ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యం వెంటనే కల్పించకపోవడం వల్ల మదీనా స్టేషన్ వద్ద ప్రయాణీకుల్లో తీవ్ర ఆందోళన నెలకొని వుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com