అహ్మది ఆయిల్ రిఫైనరీ వద్ద భారీ అగ్ని ప్రమాదం

- October 18, 2021 , by Maagulf
అహ్మది ఆయిల్ రిఫైనరీ వద్ద భారీ అగ్ని ప్రమాదం

కువైట్: అహ్మిలోని పాత రిఫైనరీలోని ఓ యూనిట్ భారీ అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ పేలుడులో ఎవరికీ ఎలాంటి గాయీలూ కాలేదు. నేషనల్ పెట్రోలియం కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం ఎఆర్‌డిఎస్ యూనిట్ వద్ద ఈ ఘటన జరిగింది. మినా అల్ అహ్మది రిఫైనరీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఫైర్ ఫైటింగ్ బృందాలు సకాలంలో స్పందించి మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఎఆర్‌డి యూనిట్ 42 అలాగే అటువైపుగా దారి తీసే లైన్లన్నీ ఐసోలేట్ చేసినట్లు కంపెనీ పేర్కొంది. భారీ శబ్దాల్ని స్థానికులు విన్నారు ఈ ఘటనకు సంబంధించి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com