సైబరాబాద్ లో ‘గ్రీవెన్స్ సెల్’ సమీక్షా సమావేశం
- October 22, 2021
హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లో డీసీపీలు,అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది తో ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర గ్రీవెన్స్ సెల్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పోలీసుల సమస్యల పరిష్కారానికి సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లో గ్రీవెన్స్ సెల్ ను ఏర్పాటు చేసిన విషయం విధితమేనన్నారు. కాగా సిబ్బంది నుంచి గ్రీవెన్స్ సెల్ కు మంచి స్పందన వస్తుందన్నారు. గతవారం గ్రీవెన్స్ సెల్ కు వచ్చిన ఫిర్యాదులు పరిష్కారంపై సీపీ సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే ఈవారం వచ్చిన ఫిర్యాదులను, పెండింగ్ ఫైల్స్ ను త్వరితగతిన క్లియర్ చేయాలన్నారు.
ఈరోజు ముఖ్యంగా హెచ్ఆర్ఎమ్ఎస్, సేవా పథకాల ప్రపోజల్స్ తదితర అంశాలు చర్చకు వచ్చాయి. సీఏఓ లు, సెక్షన్ సూపరింటెండెంట్లు ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించాలన్నారు. సిబ్బందికి సమస్యలుంటే ఉంటే గ్రీవెన్స్ సెల్(8333993272) ద్వారా తన దృష్టికి తీసుకురావాలన్నారు.
ఈ సమావేశంలో సైబరాబాద్ శంషాబాద్ డీసీపీ ఎన్. ప్రకాష్ రెడ్డి క్రైమ్స్ డీసీపీ రోహిణీ ప్రియదర్శినీ విమెన్& చిల్డ్రన్ సేఫ్టీవింగ్ డీసీపీ అనసూయ, బాలానగర్ డీసీపీ పద్మజా, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, సిఆర్ హెడ్ క్వార్టర్ ఏడీసీపీ ఎండీ రియాజ్ ఉల్ హక్, ఏసీపీ మట్టయ్య, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ చంద్రకళ, చీఫ్ అడ్మిన్ ఆఫీసర్ గీత, వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









