టీ20 వరల్డ్‌కప్ సూపర్-12లోకి నమీబియా..
- October 22, 2021
షార్జా: టీ20 వరల్డ్‌కప్ సూపర్-12కి నమీబియా అర్హత సాధించింది. ఐర్లాండ్‌తో షార్జా వేదికగా శుక్రవారం జరిగిన క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన నమీబియా.. ప్రధాన టోర్నీకి అర్హత సాధించింది. ఆడిన మూడు మ్యాచ్‌లకిగానూ రెండింటిలో ఓడిపోయిన ఐర్లాండ్.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. గ్రూప్-ఎ నుంచి సూపర్-12కి ఇప్పటికే శ్రీలంక అర్హత సాధించగా.. తాజాగా రెండో బెర్తుని నమీబియా దక్కించుకుంది. గ్రూప్- బి నుంచి స్కాట్లాండ్, బంగ్లాదేశ్ సూపర్-12కి అర్హత సాధించాయి.
మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్.. 8 వికెట్ల నష్టానికి 125 పరుగులే చేయగలిగింది. ఆ జట్టులో ఓపెనర్లు స్టిర్లింగ్ (38: 24 బంతుల్లో 5x4, 1x6), కెవిన్ ఓబ్రైన్ (25: 24 బంతుల్లో 2x4) చెప్పుకోదగ్గ స్కోరు చేసినా.. మిడిలార్డర్ తేలిపోయింది. ఎంతలా అంటే ఏకంగా ఏడుగురు బ్యాట్స్‌మెన్‌లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. నమీబియా బౌలర్లలో ప్రైలింక్ మూడు వికెట్లు పడగొట్టగా.. వైసీ రెండు, స్మిత్, స్కూల్జ్ చెరో వికెట్ తీశారు.
126 పరుగుల ఛేదనలో నమీబియా ఓపెనర్లు విలియమ్స్ (15), జెనె గ్రీన్ (24) తక్కువ స్కోరుకే ఔటైనా.. కెప్టెన్ ఎరాస్మస్ (53 నాటౌట్: 49 బంతుల్లో 3x4, 1x6) అజేయ అర్ధశతకంతో జట్టుని గెలిపించాడు. అతనికి చివర్లో డేవిడ్ వైస్ (28 నాటౌట్: 14 బంతుల్లో 1x4, 2x6) చక్కటి సహకారం అందించాడు. దాంతో.. నమీబియా మరో 9 బంతులు మిగిలి ఉండగానే 126/2తో విజయాన్ని అందుకుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







