దేశ పౌరులు, ప్రవాసులకు కువైట్ హెచ్చరిక!
- October 24, 2021
కువైట్: కువైట్ సమాచార మంత్రిత్వశాఖ దేశ పౌరులు, ప్రవాసులకు తాజాగా కీలక సూచన చేసింది. గుర్తుతెలియని వ్యక్తులు పంపించే సందేశాలతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఆగంతకుల నుంచి వచ్చే ఈ-మెయిల్స్, ఎలక్ట్రానిక్ లింక్స్‌కు స్పందించకపోవడం మంచిదని తెలియజేసింది. మీకు పార్శిల్ వచ్చిందంటూ నివాసితులకు ఇలా సంబంధంలేని లింక్స్ పంపించి కొందరు కేటుగాళ్లు డబ్బులు వసూలు చేస్తున్న సంఘటనలు దేశంలోని పలు ప్రాంతాల్లో ఇటీవల తరచూ చోటు చేసుకుంటున్న నేపథ్యంలో తాజాగా మంత్రిత్వశాఖ ఈ అలెర్ట్ జారీ చేసింది.
అందుకే గుర్తు తెలియని వ్యక్తుల నుంచి పార్శిల్ పేరుతో వచ్చే ఎలక్ట్రానిక్ లింక్స్‌కు నగదు పంపించి మోసపోవద్దని సంబంధిత అధికారులు ప్రవాసులు, దేశ పౌరులను సూచించారు. ఈ మేరకు మంత్రిత్వశాఖ అధికారిక సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో కూడా ప్రత్యేక ప్రకటనలు ఇచ్చింది. ఇలా ఎదైనా అనుమానాస్పద లింక్స్ వస్తే తమ దృష్టికి తీసుకురావాలని అధికారులు కోరారు. సాధ్యమైనంత వరకు ఈ ఫేక్ మెసేజ్‌లకు స్పందించవద్దని చెప్పుకొచ్చారు.
తాజా వార్తలు
- లులు గ్రూప్ తిరిగి విజాగ్లో మాల్ ప్రాజెక్ట్ ప్రారంభం, ఏపీ ప్రభుత్వంతో MoU
- జగన్‌కు చెందిన ఆస్తులపై స్టే కొనసాగాలి
- టీటీడీకి రూ.కోటి విరాళం
- ప్రభుత్వాస్పత్రిలో దారుణం..ఇంజక్షన్ వికటించి 17 మంది చిన్నారులకు అస్వస్థత
- హైదరాబాద్–విజయవాడ హైవే పై 60 అండర్‌పాస్‌లు
- నితీశ్ రాజకీయాల్లో అరుదైన రికార్డు
- ఎల్బీ స్టేడియంలో అరైవ్ అలైవ్ లాంచ్
- CII సదస్సు తొలిరోజు రికార్డ్ స్థాయిలో పెట్టుబడులు
- ఖతార్ లో ఉపాధ్యాయులకు సామర్థ్య పరీక్షలు..!!
- కువైట్ లో పొగమంచు, రెయిన్ అలెర్ట్ జారీ..!!







