టీమిండియాపై పాక్ ఘన విజయం
- October 24, 2021
దుబాయ్:టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఘన విజయాన్ని అందుకుంది. 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 17.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్లు బాబర్ అజమ్(68 పరుగులు, 52 బంతులు; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), మహ్మద్ రిజ్వాన్( 79 పరుగులు, 55 బంతులు; 6 ఫోర్లు, 3 సిక్సర్లు)లు కలిసి తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 152 పరుగులు కొట్టి పాకిస్తాన్‌కు ఘన విజయాన్ని అందించారు. అంతకముందు టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. 31 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన తర్వాత కోహ్లి, పంత్ కలసి టీమిండియా ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. కెప్టెన్ కోహ్లి(49 బంతుల్లో 57 పరుగులు, 5 ఫోర్లు, ఒక సిక్స్), పంత్( 30 బంతుల్లో 39 పరుగులు, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకట్టుకున్నారు. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది 3, హసన్ అలీ 2, షాబాద్ ఖాన్, హరిస్ రౌత్ 1 చెరో వికెట్ తీశారు.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం