ఆంధ్రప్రదేశ్: కోవిడ్ మృతుల కుటుంబాలకు రూ. 50 వేల ఎక్స్ గ్రేషియా
- October 26, 2021
అమరావతి : కరోనా కారణంగా మృతి చెందిన కుటుంబాలకు జగన్ సర్కార్ తీపి కబురు చెప్పింది. కోవిడ్ మృతుల కుటుంబాలకు రూ. 50 వేల ఎక్స్ గ్రేషియా ను చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి నుంచి ఈ మొత్తాన్ని చెల్లించేందుకు ఆదేశాలు జారీ చేసింది సర్కార్. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి కోవిడ్ మృతుల జాబితా రూపొందించి చెల్లింపులు చేయాలని సూచనలు చేసింది. జిల్లా రెవెన్యూ అధికారి ఆధ్వర్యంలో ప్రతి దరఖాస్తుకు ప్రత్యేక నెంబర్ జారీ చేయాలని మార్గదర్శకాలు విడుదల చేయనుంది ప్రభుత్వం. మృతుల కుటుంబాల నుంచి
దరఖాస్తు తీసుకున్న రెండు వారాల్లోగా పరిహారం చెల్లింపు పూర్తి చేయాలని సూచనలు చేసింది. దరఖాస్తు కోసం ప్రత్యేక ప్రొఫార్మా రూపొందించింది వైద్యారోగ్య శాఖ.
తాజా వార్తలు
- కె ల్యాండ్ టూరిజం, ఎంటర్ టైన్ ప్రాజెక్ట్ లో సందడి..!!
- గాజాపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంయుక్త ప్రకటన..!!
- దుబాయ్ లో స్నేహితుడిని హత్య చేసిన వ్యక్తికి జీవిత ఖైదు..!!
- కొత్త పర్యాటక, సాంస్కృతిక కేంద్రంగా జెడ్డా సెంట్రల్..!!
- ప్రైవేట్ రంగంలో రిటైర్ ఎంప్లాయిస్ కు గుడ్ న్యూస్..!!
- రుస్తాక్లోని తావి అల్-హరా మార్కెట్లో వింటర్ క్రాప్..!!
- లులు గ్రూప్ తిరిగి విజాగ్లో మాల్ ప్రాజెక్ట్ ప్రారంభం, ఏపీ ప్రభుత్వంతో MoU
- జగన్కు చెందిన ఆస్తులపై స్టే కొనసాగాలి
- టీటీడీకి రూ.కోటి విరాళం
- ప్రభుత్వాస్పత్రిలో దారుణం..ఇంజక్షన్ వికటించి 17 మంది చిన్నారులకు అస్వస్థత







