ప్రయాణ ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా..!
- October 26, 2021
అమెరికా: భారత్‌పై విధించిన ప్రయాణ ఆంక్షలను అమెరికా ఎత్తివేసింది. భారత్‌తో పాటు పలు దేశాలపై కూడా ఆంక్షలను ఎత్తివేసిన అమెరికా ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. తాజాగా జారీ చేసిన నిబంధనలు నవంబర్ 8వ తేదీ నుండి అమల్లోకి రానున్నాయి. కరోనా విజృంభణతో గత సంవత్సరం అమెరికా విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అమెరికా ప్రయోజనాల దృష్ట్యా ఆంక్షల్ని సడలిస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. వ్యాక్సిన్ ఆధారిత అంతర్జాతీయ ప్రయాణాల పునరుద్ధరణకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.
రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వారిని నవంబర్ 8 నుంచి అమెరికాలోకి అనుమతించనున్నారు. ప్రయాణికులు విమానం ఎక్కేముందే తమ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లను ఇవ్వాల్సి ఉంటుంది. అమెరికా, డబ్ల్యుహెచ్వో గుర్తించిన వ్యాక్సిన్లు తీసుకున్నవారికి అమెరికాలోకి అనుమతి ఉంటుందని నిబంధనల్లో పేర్కొన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న కూడా కరోనా నెగిటివ్ రిపోర్టు సమర్పించాల్సి ఉంటుంది. అలాగే రెండేళ్ల పిల్లలకు కొవిడ్ టెస్టు అవసరం లేదని నిబంధనల్లో స్పష్టం చేశారు. అలాగే వ్యాక్సినేషన్ రేటు 10 శాతం కంటే తక్కువగా ఉన్న సుమారు 50 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు సైతం ఆంక్షల నుంచి వెసులుబాటు కల్పించింది. వీరు అమెరికాకు వచ్చిన రెండు నెలల్లోగా వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్‌ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!