'అన్ స్టాపబుల్ విత్ NBK’ ఫస్ట్ గెస్ట్ గా మంచు మోహన్ బాబు ఫ్యామిలీ

- October 26, 2021 , by Maagulf
\'అన్ స్టాపబుల్ విత్ NBK’ ఫస్ట్ గెస్ట్ గా మంచు మోహన్ బాబు ఫ్యామిలీ

నందమూరి బాలకృష్ణ ఓటీటీ లో అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ పేరుతో ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తుంది. ఇక ఈ ప్రోగ్రాం కి ‘జాంబీ రెడ్డి’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. నవంబర్ 4 నుంచి మొదలుకానున్న ఈ ప్రోగ్రాం లో ఫస్ట్ గెస్ట్ ఎవరు అనేదానిమీద సోషల్ మీడియాలో రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి హాజరు అవుతున్నారు అనే వార్తలు ఇటీవల గుప్పుమన్న విషయం విదితమే.. అయితే ఈ ప్రోగ్రాం ఫస్ట్ గెస్ట్ గా మంచు మోహన్ బాబు ఫ్యామిలీ హాజరయ్యారు. మోహన్ బాబు ని ఇంటర్వ్యూ చేసిన తరువాత సెట్ లో వారిద్దరూ కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఫస్ట్ ఎపిసోడ్ ఫుల్ ఫన్ గా నడిచిందని, సెట్ లో బాలయ్య చాలా సరదాగా ఉన్నారని తెలుస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com