పశ్చిమ సౌదీ అరేబియా,దక్షిణ జోర్డాన్ వేర్వేరు బస్సు ప్రమాదాలలో33 మంది యాత్రికులు మృతి
- March 19, 2016
సౌదీ అరేబియా-బస్సు ప్రమాదంలో 19 మంది యాత్రికులు మృతి చెందగా , అదే విధంగా దక్షిణ జోర్డాన్ మరో బస్సు ప్రమాదంలో 14 మంది యాత్రికులు మృతి చెందినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఇందులో మొదటి ప్రమాదం ఈజిప్ట్ కు చెందిన 19 మంది హజ్ యాత్రికులు పశ్చిమ సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదంలో మరణించారు. వీరితో పాటు ప్రయాణిస్తున్న మరో 22 మంది యాత్రికులు తీవ్రంగా గాయపడ్డారని ఈజిప్ట్, సౌదీ అరేబియా దేశాలలోని అధికారులు తెలిపారు. అయితే కైరో లో పర్యాటక శాఖ తెలిపిన వివరాల ప్రకారం 19 మంది యాత్రికులు మృతి చెందారని అయితే , గాయపడినవారు 15 మంది మాత్రమేనని పేర్కొంది. జెడ తీర నగరం హిజ్రత్ రహదారి పై పవిత్ర మదీనా నగరం సమీపంలో వారిని తీసుకువెళ్ళే బస్సు పక్కకు మలుపు తిరుగుతున్న సమయంలో ప్రమాదానికి గురై 19 మంది మరణించారని సౌదీ రెడ్ క్రెసెంట్ ప్రతినిధి ఖలేద్ బెన్ మెస్సెద్ అల్- సిహ్లి చెప్పారు. బస్సు ప్రయాణికులు అందరు అరబ్ దేశీయులు కాగా బస్సు డ్రైవర్ ఆసియా దేశానికి చెందినవాడు. ప్రతి ఏడాది మిలియన్ల సంఖ్యలో ముస్లిములు ఉమ్రా మైనర్ పుణ్యక్షేత్రం మరియు వార్షిక హజ్ యాత్రకు సౌదీ అరేబియా సందర్శిస్తారు.దక్షిణ జోర్డాన్ లో మరో బస్సు ప్రమాదం.....సౌదీ సరిహద్దు సమీపంలో దక్షిణ జోర్డాన్ వద్ద మరో బస్సు ప్రమాదంలో 14 మంది యాత్రికులు మరణించారు మరొక 36 మంది గాయపడ్డారు. దేశం యొక్క పౌర రక్షణ సేవ డ్రైవర్ 320 కిలోమీటర్ల (200 మైళ్ల) వేగంలో బస్సు నడుపుతూ ఆగ్నేయ పక్కకు మలుపు తిప్పుతున్న సమయంలో వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో ఈ ప్రమాదం జరిగింది. గత సెప్టెంబర్ లో హజ్ సమయంలో తొక్కిసలాట జరిగి 2.300 విదేశీ తీర్థ యాత్రికుల మృతి చెందిన విషయం విదితమే.
తాజా వార్తలు
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







