చేర్ర్రీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో

- March 20, 2016 , by Maagulf
చేర్ర్రీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో

మెగా స్టార్ వారసుడు అంటే హీరో రాం చారణ్ మాత్రమే అనేది మెగా అభిమానుల మాట. చిరంజీవి కొడుకుగా ఒచ్చినా కూడా నెమ్మది నెమ్మదిగా తనకంటూ ఒక భారీ ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నాడు చెర్రీ. ఈ హీరో బర్త్ డే సెలెబ్రేషన్ లని మిన్ను అంటేలా చెయ్యాలి అని ప్లాన్ చేస్తున్నారు అతని అభిమానగణం.గ్రాండ్ గా అంటే.. పార్టీలు చేసుకోవడం కాదు.. సమాజంలో చైతన్యం నింపేలా ప్రపంచవ్యాప్తంగా బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా బ్లడ్ డొనేషన్ అనేది చాలా అరుదైన , గొప్పదైన విషయం అని చెప్పాలి. అమెరికా లో ఐదు క్యాంప్ లూ, మస్కట్ లో రెండూ , దుబాయ్ ఖతర్ లో ఒకటీ చొప్పున బ్లడ్ బ్యాంక్ లు ఏర్పాటు చెయ్యబోతున్నారు.మహరాష్ట లో 5 ముంబైలో ఒకటి బెంగళూరు సిటీలో 9 తమిళనాడులో 3 సెంటర్లతో పాటు.. ఏపీ తెలంగాణల్లో 180-190 బ్లడ్ డొనేషన్ క్యాంప్ లు ఏర్పాటు కానున్నాయి. కానీసం ఒక్కొక్క సెంటర్ లో వెయ్యి మంది వరకూ డొనేషన్ చెయ్యబోతున్నారు. రాం చరణ్ ఆఫీస్ నుంచి ఈ విషయం మీద అధికారిక ప్రకటన ఒచ్చింది. అభిమానుల చేతుల మీదగా జరగబోయే ఈ కార్యక్రమం లో మెగా బ్లడ్ బ్యాంక్ వారు రోటరీ క్లబ్ , ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ , లయన్స్ క్లబ్ వంటి వారు సహకారం తో ఇది చేస్తున్నారు. ఈ సారి రాం చరణ్ బర్త్ డే ని ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా ప్లాన్ చేస్తున్నారు అన్న మాట. ఇలా ఇంటర్నేషనల్ లెవెల్ లో ఈ ప్రోగ్రాం చెయ్యడం ద్వారా చేర్ర్రీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో కూడా చేరే ఛాన్స్ ఉంది అనీ దానికోసం అభిమానులు ప్రయత్నిస్తున్నారు అనీ అంటున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com