సాంప్రదాయ వీధి దీపాల స్థానంలో LED లైట్లు పెట్టాలి..

- October 31, 2021 , by Maagulf
సాంప్రదాయ వీధి దీపాల స్థానంలో LED లైట్లు పెట్టాలి..

ఖతార్: సాంప్రదాయ వీధి దీపాల స్థానంలో ఎల్‌ఈడీ లైట్లను పెట్టాలని సిటిజన్స్.. పబ్లిక్ వర్క్స్ అథారిటీ (Ashghal)ను కోరుతున్నారు. స్థానిక అరబిక్ దినపత్రిక ‘అరేయా’తో పలువురు సిజిటన్స్ తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. సూర్యాస్తమయం తర్వాత రోడ్లపై స్పష్టంగా చూసేందుకు పసుపు లైట్ల స్థానంలో LED లైట్లు పెట్టడం ద్వారా  కళ్ళకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని, సుదీర్ఘ జీవిత కాలాన్ని కలిగి ఉన్నందునా ఆర్థికంగా కూడా కలిసివస్తుందని పబ్లిక్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా జి-రింగ్ రోడ్‌లోని పాత లైటింగ్ యూనిట్ల స్థానంలో ఎల్ఈడీ లైట్ల ప్రాజెక్ట్ ను మొదటగా పూర్తి చేయవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. LED లైట్లతో నిర్వహణ ఖర్చులను అలాగే విద్యుత్ వినియోగ వ్యయాన్ని తగ్గించడానికి దోహదం చేస్తాయి. సంప్రదాయ వ్యవస్థతో పోలిస్తే LED లైటింగ్ యూనిట్లు 50-55% శక్తిని ఆదా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. రహదారి భద్రతే లక్ష్యంగా వివిధ ప్రాంతాలలో సాంప్రదాయ వీధి దీపాల స్థానంలో ఎల్‌ఈడీ లైట్లను అమర్చాలని Ashghal ఇంతకుముందు ప్రకటించిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com