సాంప్రదాయ వీధి దీపాల స్థానంలో LED లైట్లు పెట్టాలి..
- October 31, 2021
ఖతార్: సాంప్రదాయ వీధి దీపాల స్థానంలో ఎల్‌ఈడీ లైట్లను పెట్టాలని సిటిజన్స్.. పబ్లిక్ వర్క్స్ అథారిటీ (Ashghal)ను కోరుతున్నారు. స్థానిక అరబిక్ దినపత్రిక ‘అరేయా’తో పలువురు సిజిటన్స్ తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. సూర్యాస్తమయం తర్వాత రోడ్లపై స్పష్టంగా చూసేందుకు పసుపు లైట్ల స్థానంలో LED లైట్లు పెట్టడం ద్వారా కళ్ళకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని, సుదీర్ఘ జీవిత కాలాన్ని కలిగి ఉన్నందునా ఆర్థికంగా కూడా కలిసివస్తుందని పబ్లిక్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా జి-రింగ్ రోడ్‌లోని పాత లైటింగ్ యూనిట్ల స్థానంలో ఎల్ఈడీ లైట్ల ప్రాజెక్ట్ ను మొదటగా పూర్తి చేయవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. LED లైట్లతో నిర్వహణ ఖర్చులను అలాగే విద్యుత్ వినియోగ వ్యయాన్ని తగ్గించడానికి దోహదం చేస్తాయి. సంప్రదాయ వ్యవస్థతో పోలిస్తే LED లైటింగ్ యూనిట్లు 50-55% శక్తిని ఆదా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. రహదారి భద్రతే లక్ష్యంగా వివిధ ప్రాంతాలలో సాంప్రదాయ వీధి దీపాల స్థానంలో ఎల్‌ఈడీ లైట్లను అమర్చాలని Ashghal ఇంతకుముందు ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- సమాజ సేవలో 'అర్జాస్ స్టీల్' ముందంజ
- IPL 2026: CSK పై RR విజయం
- యాపిల్స్ తో మోసం..హైదరాబాద్ వ్యాపారికి రూ.5.7 కోట్లు టోపీ !!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో ముగిసిన ఖతార్ ఎమిర్ భేటీ
- దుబాయ్ వ్యాపార రంగానికి AED 1 బిలియన్ సపోర్ట్ ప్యాకేజ్
- ఏనుగుకు గులాబీ రంగు..ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
- ఏప్రిల్ లో బ్యాంకులకు 14 రోజులు సెలవులు..
- తెలంగాణ: అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం
- నేవీ చీఫ్ మృతిని కన్ఫర్మ్ చేసిన ఇరాన్
- నాయుడుపేటలో టిడ్కో ఇళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు









