నవంబర్ 27 నుంచి మదీనాకు ఎతిహాద్ విమాన సర్వీసులు

- November 01, 2021 , by Maagulf
నవంబర్ 27 నుంచి మదీనాకు ఎతిహాద్ విమాన సర్వీసులు

అబుధాబి: కరోనా ఎఫెక్ట్ కారణంగా సౌదీ లోని మదీనా కు విమాన సర్వీసులు నిలిపివేసిన ఎతిహాద్ ఎయిర్ వేస్ మళ్లీ సేవలను స్టార్ట్ చేయనుంది. నవంబర్ 27 నుంచి అబుదాబి నుంచి మదీనా కు విమానాలను నడిపిస్తామని సంస్థ ప్రకటించింది. ఎయిర్ బస్ 321 ద్వారా వారానికి మూడు సార్లు అబుదాబి నుంచి మదీనా కు ఫ్లైట్ సర్వీసులు ఉంటాయని తెలిపింది. సౌదీలోని పవిత్ర మక్కా, మదీనా లకు ఎప్పటి మాదిరిగానే పర్యాటకులను అనుమతిస్తామని సౌదీ ప్రభుత్వం గత నెలలోనే ప్రకటించింది. ఈ నేఫథ్యంలోనే మదీనాకు ఎతిహాద్ విమాన సర్వీసులను పునరుద్దరిస్తోంది. ఐతే ప్రయాణికులు కచ్చితంగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలని నిబంధన పెట్టింది. సౌదీ ప్రభుత్వం కూడా మదీనా కు వచ్చే వారు కచ్చితంగా రెండు డోసుల వ్యాక్సినేషన్ తీసుకున్న వారై ఉండాలని తెలిపింది. వ్యాక్సినేషన్ పూర్తైన వారికి ఎలాంటి క్వారంటైన్ నిబంధనలను సౌదీ విధించలేదు. దీంతో రెండు డోసుల వ్యాక్సిినేషన్ పూర్తైన వారు మదీనా కు వెళ్లవచ్చు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com