పాస్‌పోర్ట్ కవర్ కోసం ఆర్డ్‌ర్ చేస్తే...ఏకంగా పాస్‌పోర్టే వచ్చేసింది
- November 05, 2021కేరళ: ఆన్లైన్ షాపింగ్ రంగం అభివృద్ది చెందిన తరువాత చిన్న చిన్న వాటిని కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నారు. ఆన్లైన్లో ఒకటి ఆర్డర్ చేస్తే మరొకటి వచ్చిందని ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో వాటిపై ట్రోల్ చేస్తూనే ఉన్నారు.ఇలాంటి సంఘటన ఒకటి ఇటీవల జరిగింది.కేరళకు చెందిన మిథున్ బాబు అనే వ్యక్తి పాస్‌పోర్ట్ కవర్‌ను ఆన్లైన్లో బుక్ చేశాడు. బుక్ చేసిన కవర్ ఇంటికి వచ్చింది. పార్శిల్ కవర్‌ను ఒపెన్ చేసి చూసి మిథున్ షాక్ అయ్యాడు.
పార్శిల్ కవర్లో పాస్‌పోర్ట్ కవర్ తో పాటుగా ఒరిజినల్ పాస్పోర్ట్కూడా ఉన్నది.వెంటనే ఈ విషయాన్ని అమెజాన్ కస్టమర్ కేర్ సెంటర్‌కు కాల్ చేసి చెప్పగా, పొరపాటు జరిగిందని, భవిష్యత్తులో జరగకుండా చూసుకుంటామని సమాధానం ఇచ్చారు.ఆ ఒరిజినల్ పాస్‌పోర్ట్ త్రిసూర్‌కు చెందిన మహ్మద్ సాలిహ్ అనే వ్యక్తికి సంబంధించినది.ఆ పాస్‌పోర్ట్ అమెజాన్ చేతికి ఎలా వచ్చింది అన్నది అర్ధంగాని విషయం.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన