లూలూ గ్రూప్ సంస్థల అధినేత ఎం.ఏ యూసుఫ్ అలీకి ప్రీమదూత అవార్డు..!
- November 08, 2021
అబుధాబి: ప్రముఖ పారిశ్రామిక వేత్త, లూలూ గ్రూప్ సంస్థల అధినేత ఎం.ఏ యూసుఫ్ అలీ.. ఇండోనేషియాలోని అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ప్రీమదూత అవార్డును అందుకున్నారు. ఇండోనేషియా అధ్యక్షుడి చేతుల మీదుగా ఈ అవార్డును తీసుకున్నారు. వ్యాపార, వాణిజ్య రంగాల్లో ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఇండోనేషియా ప్రభుత్వం ఈ అవార్డును ప్రదానం చేసింది. కాగా.. యూసుఫ్ అలీ ఈ సందర్భంగా ఇండోనేషియా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో ఇండోనేషియాలో మరిన్ని హైపర్ మార్కెట్లను ప్రారంభిస్తానన్నారు. ఈ-కామర్స్ రంగ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తానని కూడా పేర్కొన్నారు. కాగా.. అబుధాబిలో ఎమిరేట్స్ ప్యాలెస్లో ఈ అవార్డు ప్రదాన కార్యక్రమం జరిగింది.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







