బండి సంజయ్‌పై నిప్పులు చెరిగిన సీఎం కేసీఆర్...
- November 08, 2021
హైదరాబాద్: సీఎం కెసిఆర్ ప్రగతి భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా కెసిఆర్ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై నిప్పులు చెరిగారు. తెలంగాణ బిల్లు పాసైనప్పుడు కేసీఆర్ ఓటేయలేదు అని బండి సంజయ్ అంటున్నాడు. ఆయన మాటలు వింటుంటే ఏం చేయాలో అర్థం కావడం లేదు. తెలంగాణ ఉద్యమంలో నువ్వెక్కడ. నువ్వు ఎవ్వనికి తెలుసు ఈ రాష్ట్రంలో. నీ పత్తానే లేదు. ఇప్పుడొచ్చి దుంకుతా అంటే నడవదు. కథ తేల్చే దాకా నేనే మాట్లాడుతా. వదిలిపెట్టను. ప్రతి రోజు మాట్లాడుతా. గారడీ చేస్తామంటే నడవనివ్వను. తెలంగాణకు ఏం చేసినావో చెప్పు అంటడు ఈ మొగోడు. తెలంగాణలో ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం అందుతోంది. నీ ఇంటికి కూడా మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయి కదా?
దేశాన్ని నడిపే పార్టీ అధ్యక్షుడు.. నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు. గొర్రెల పైసల్లో ఒక్క పైసా కేంద్రానిది ఉందని తేలితే నేను ఒకటే నిమిషంలో సీఎం పదవికి రాజీనామా చేస్తాను. నేషనల్ కో ఆపరేటివ్ బ్యాంక్ వద్ద గొర్రెల పథకానికి పైసలు అప్పుగా తీసుకున్నాం. వడ్డీతో సహా తిరిగి కడుతున్నాం. నీవు ఇచ్చింది ఏం తోక. అబద్దాలు మాట్లాడటం సరికాదు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక్క రాష్ట్రంలో కూడా తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి, పెన్షన్లు ఇస్తున్నారా? పెట్రోల్, డీజిల్ ధరలపై మాట్లాడితే పక్క దేశాలకు పోవాలని అంటున్నారు. అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు అని కేసీఆర్ మండిపడ్డారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







