కోయగూడెం నుంచి వారణాసి ఐఐటికి చేరనున్న శ్రీలత
- November 08, 2021
హైదరాబాద్: కోయగూడెం నుంచి ప్రతిష్టాత్మక ఐఐటీలో స్థానం సంపాదించుకున్న నిరుపేద కోయ తెగకు చెందిన గిరిజన విద్యార్థి కారం శ్రీలతకి మంత్రి కే తారకరామారావు అండగా నిలిచారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం మామిడి గూడెం కి చెందిన శ్రీలత చిన్ననాటి నుంచి చదువులో అద్భుతమైన ప్రతిభను ప్రదర్శిస్తూ వస్తుంది. తన నిరుపేద పరిస్థితులను దాటుకుని ఇంటర్మీడియట్లో 97 శాతం మార్కులను సాధించింది. నాగర్ కర్నూల్ లోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో చదివి ఐఐటీ-జేఈఈ పరీక్ష ద్వారా ఐఐటి వారణాసిలో ఇంజనీరింగ్ సీట్ సంపాదించింది. అయితే వ్యవసాయ కూలీలుగా పనిచేసే తల్లిదండ్రులు ఆమె ఫీజులు చెల్లించే పరిస్థితిలో లేరు. ఇప్పటిదాకా పూర్తి స్థాయి ప్రభుత్వ విద్యను అభ్యసించిన శ్రీలత కి ఐఐటి ఫీజులు చెల్లించేందుకు మార్గం లేక తన ఉన్నత విద్య స్వప్నం చెదిరి పోతుందేమోనని ఇబ్బందులు పడుతున్న శ్రీలత పరిస్థితి మంత్రి కే తారకరామారావు దృష్టికి వచ్చింది. వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ ఆయన తన సొంత నిధులతో శ్రీలత ఐఐటి విద్య పూర్తయ్యేవరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ మేరకు ప్రగతి భవన్ లో శ్రీలతను అభినందించారు. ఆమె విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు తాను బాధ్యత తీసుకుంటున్నట్లు ఆమె కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.
అత్యంత నిరుపేద పరిస్థితుల్లో అనేక సవాళ్లు దాటుకొని ఐఐటీలో సీటు సాధించిన శ్రీలత ప్రస్థానం లక్షలాది మందికి ఒక స్ఫూర్తిగా నిలుస్తుందని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. ప్రజ్ఞాపాటవాలు ఎవరి సొత్తు కాదని, కృషితో ఏలాంటి లక్ష్యాన్నైనా సాధించవచ్చనే విషయాన్ని శ్రీలత నిరూపించిందని కేటీఆర్ అన్నారు. శ్రీలత లాంటి ఒక అద్భుతమైన టాలెంట్ ఉన్న ఆడబిడ్డ కి అండగా నిలవడం తనకు అత్యంత సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తుందని కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా ఐఐటి విద్యకు అవసరమైన డబ్బులను అందించారు. భవిష్యత్తులోనూ శ్రీలతకు అండగా నిలుస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఐటీలోనూ మరింత ప్రతిభ చాటాలని అభినందించారు.
నిరుపేద కోయగూడెం కి చెందిన తమ కుటుంబ ఆశ శ్రీలత కి, ఆమె విద్యాభ్యాసానికి మంత్రి కేటీఆర్ అండగా నిలవడం పట్ల ఆమె కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







