యూఏఈ లో భారీ వర్షాలు... అలర్ట్ గా ఉండాలని ప్రభుత్వం సూచన

- November 09, 2021 , by Maagulf
యూఏఈ లో భారీ వర్షాలు... అలర్ట్ గా ఉండాలని ప్రభుత్వం సూచన

యూఏఈ: యూఏఈలోని కొన్ని ప్రాంతాలలో సోమవారం వడగళ్ళతో కూడిన భారీ వర్షాలు కురవడంతో పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో పర్వత ప్రాంతాలు, లోయలకు దూరంగా ఉండాలని దుబాయ్ పోలీసులు ప్రజలకు సూచించారు. తూర్పు ప్రాంతంలో భారీ వర్షాలు, బలమైన గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం (NCM) హెచ్చరిక జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లో "అస్థిర వాతావరణ పరిస్థితులు" ఉంటాయని NCM హెచ్చరించింది. చెట్లతో సహా బలహీనమైన నిర్మాణాలు ప్రమాదకరంగా మారవచ్చని, ప్రజలు వాటికి దూరంగా ఉండాలి అని NCM సూచించింది. ఫుజైరా, ఖోర్ ఫక్కన్, కల్బా, హట్టా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com