క్షిపణి ప్రయోగం : ఉత్తరకొరియా
- March 21, 2016
దక్షిణ కొరియా, అమెరికా సహా పలు దేశాల నుంచి వ్యతిరేకత, ఆందోళనలు వ్యక్తమవుతున్నప్పటికీ ఉత్తరకొరియాలో క్షిపణి ప్రయోగాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సోమవారం సముద్రం నుంచి మరోసారి తక్కువ విస్తృతి కలిగిన రాకెట్, క్షిపణులను ప్రయోగించిందని ద.కొరియాకు చెందిన యోన్హాప్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. అయితే ద.కొరియా రక్షణ విభాగం ఉ.కొరియా తాజా క్షిపణి ప్రయోగాలను ధ్రువీకరించలేదు.
ఇటీవల ఉ.కొరియా సముద్రం నుంచి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిందని ద.కొరియా రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. అంతకుముందు కూడా పలుమార్లు రాకెట్లు, క్షిపణి ప్రయోగాలతో ఉ.కొరియా ఉద్రిక్త రేపుతున్న సంగతి తెలిసిందే. అణ్వస్త్ర పరీక్షలు, ప్రయోగాలు చేపడతామని ఉ.కొరియా దేశాధినేతకిమ్ జోంగ్ ఉన్ ప్రకటించిన తర్వాత వరుస క్షిపణి ప్రయోగాలు జరగడం గమనార్హం. కొద్ది రోజుల క్రితం ఉ.కొరియా తాము హైడ్రోజన్ బాంబును పరీక్షించామని ప్రకటించడంతో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి విదితమే.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







