ఏపీ తీర ప్రాంతాల్లో రెడ్ అలర్ట్..
- November 11, 2021
అమరావతి: బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లను ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం ముంచె త్తుతుంది. నేడు తుఫాన్ తీరం దాటనున్న నేపథ్యంలో ఏపీలోని తీర ప్రాంతాల్లోని జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలె వరూ ఇళ్లలోనుంచి బయటకు రావొద్దని ప్రభుత్వం హెచ్చరించింది. ఇక తుఫాన్ కొద్ది సేపట్లో తమిళ నాడులోని కరైకల్, ఏపీలోని శ్రీహరి కోట వద్ద ఉన్న కడలూరులో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఇప్పటికే ఈ వాయుగుండం వల్ల తమిళనాడులో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్కడ జన జీవనం అస్తవ్యస్తం అయింది. ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతాల్లో కూడా గంటకు 50-60 కీలోమీటర్ల నుంచి ఈదురు గాలులు వీస్తున్నాయి. ఇప్పటికే తమిళ నాడు, ఏపీలోని తిరుపతిలో భారీ వర్షం పడుతోంది. ఈ వర్షాల తో తమిళనాడులో 14 మంది మృతి చెందారు. ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నారు. భారీ వర్షాలతో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







