డిసెంబర్ 7 చలి తీవ్రత ఎక్కువయ్యే అవకాశం

- November 12, 2021 , by Maagulf
డిసెంబర్ 7  చలి తీవ్రత ఎక్కువయ్యే అవకాశం

సౌదీ అరేబియా :  దేశంలో చలి తీవ్రత డిసెంబర్ 7 నుంచి మొదలుకానుంది. జనవరి 14 వరకు చలి ఎక్కువగా ఉంటుందని వాతావారణ అధికారులు తెలిపారు. ఇప్పటికే చలి కాస్త మొదలైనప్పటికీ డిసెంబర్ 7 నుంచి జనవరి 14 వరకు చలి ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. వాస్తవానికి డిసెంబర్ 22 నుంచి జనవరి 31 వరకు చలి ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ సారి మాత్రం డిసెంబర్ 7 నుంచే చలి తీవ్రత ఎక్కువ ఉంటుందంటున్నారు. ఇదే సమయంలో స్నో ఫాల్, పొగమంచు కూడా అధికంగా ఉండే అవకాశం ఉంటుందని ప్రజలు అలర్ట్ గా ఉండాలని సూచిస్తున్నారు. చలితీవ్రంగా ఉండే 40 రోజుల సమయంలో డే టైమ్ లో టెంపరేచర్లు కూడా భారీగా పడిపోవచ్చని అధికారులు చెబుతున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com