రాత్రిపూట ఎందుకు ఎక్కువ మూత్ర విసర్జన చేయాల్సివస్తు౦ది?

- November 12, 2021 , by Maagulf
రాత్రిపూట ఎందుకు ఎక్కువ మూత్ర విసర్జన చేయాల్సివస్తు౦ది?

ప్రముఖ కార్డియాలజిస్ట్  చెప్పిన ఆరోగ్యసూత్ర౦.... రాత్రిపూట మధ్యలో మూత్ర విసర్జనకు లేవాల్సి వస్తు౦దని పడుకునే ముందు ఏమీ నీళ్ళు తాగకూడదని ఎంత మంది అనుకు౦టున్నారు?  

కాస్త మధ్య వయస్కులకీ, వయస్సు పైబడిన వారికీ ఈ బాధ ఎక్కువ. అలాగని నీళ్లుతాగకుండా పడుకోవద్దు. శరీరంలో నీటి శాతం తక్కువైతే అసలు ప్రాణానికే ముప్పు. ప్రాణం పోయేదానికంటే మధ్యలో మూత్రవిసర్జనకు లేవడం కష్టమైనా మనకే మంచిది కదా!

అసలు - రాత్రిపూట ఎందుకు ఎక్కువ మూత్ర విసర్జన చేయాల్సివస్తు౦ది? దీనికి సమాధానంగా ఒక కార్డియాలజిస్ట్ (గుండె వైద్యుడు) ఏమి చెప్పారంటే..మీరు నిటారుగా నిలబడినప్పుడు సాధారణంగా కాళ్ళలో వాపు ఉంటుంది (ముఖ్య౦గా మధ్య వయస్కులకీ, వయస్సు పైబడిన వారికీ) ఎందుకంటే గురుత్వాకర్షణ వల్ల మీ క్రి౦ది భాగాలులో, ముఖ్య౦గా కాళ్ళలో ఎక్కువ నీళ్ళు నిలువు౦టాయి. అదే, మీరు పడుకుంటే మీ దిగువ శరీరం (ట్రంక్, కాళ్ళు మొదలైనవి) మీ మూత్రపిండాలతో సమంగా ఒకే ఎత్తులో ఉంటు౦ది కనుక, మూత్రపిండాలు ఎక్కువ నీటిని తొలగి౦చేదానికి సులభంగా ఉ౦టు౦ది. మూత్రంద్వారానే మన రక్తంలోని మలినాలు,విషపదార్ధాలు విసర్జింపబడతాయి. అటువ౦టప్పుడు నీళ్ళు త్రాగడానికి సరైన సమయం ఏమిటి? ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యం.

హార్ట్ స్పెషలిస్ట్ చెప్పిన ఆరోగ్యసూత్రాలు:
1. ఉదయ౦ మేల్కొన్న తర్వాత రెండు (2) గ్లాసుల నీళ్ళు త్రాగడ౦ - అంతర్గత అవయవాలను సక్రియం చేయడానికి సహాయపడుతుంది.
2. భోజనానికి 30 నిమిషాల ముందు ఒక (1) గ్లాసు నీళ్ళు త్రాగడ౦ - జీర్ణక్రియకు సహాయపడుతుంది.
3. స్నానం చేయడానికి ముందు ఒక (1) గ్లాసు నీళ్ళు త్రాగడ౦ - రక్తపోటు తగ్గించడానికి సహాయపడుతుంది (తెలుసుకోవడం మంచిది!).
4. రాత్రి పడుకునే ముందు ఒక (1) గ్లాసు నీళ్ళు త్రాగడ౦ - స్ట్రోక్ లేదా గుండెపోటును నివారించవచ్చు (తెలుసుకోవడం చాలా చాలా మంచిది!).
5. అదనంగా, రాత్రి మధ్యలో నీరు త్రాగడ౦ రాత్రి కాలు తిమ్మిర్లను నివారించడానికి సహాయపడుతుంది.
6. కాలు కండరాలు సంకోచించడ౦ (కొ౦కర్లు) చార్లీ హార్స్ (Charley Horse) లేక దూడ తిమ్మిరి అనే రోగ౦ మన శరీర౦లో నీటి శాత౦ తక్కువయినపుడు వస్తు౦ది. రోజ౦తా సరిగా నీళ్ళు తాగడ౦ వల్ల ఈ రోగ౦ రాదు.

కాబట్టి రాత్రి నీళ్లు తాగటం కష్టంగా భావించకూడదని తెలుసుకోండి...

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com