షెడ్యూల్డ్ విమానాల పునరుద్ధరణ దిశగా ఇండియా: విదేశాంగ మంత్రి
- November 13, 2021
యూఏఈ: భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్, షెడ్యూల్డ్ విమానాల పునరుద్ధరణ దిశగా భారత ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నట్లు చెప్పారు. కేంద్ర మంత్రి, ఎక్స్పో 2020 దుబాయ్‌లో ఇండియన్ పెవిలియన్ సందర్శించారు. టూర్ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా డాక్టర్ జై శంకర్ మాట్లాడుతూ, షెడ్యూల్డ్ విమానాల పునరుద్ధరణ దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. కోవిడ్ పాండమిక్‌ని భారతదేశం సమర్థవంతంగా ఎదుర్కొందని ఆయన వివరించారు. ఎకానమీ తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటోందని చెప్పారాయన. యూఏఈ, భారతదేశానికి అత్యంత నమ్మకమైన మిత్రదేశమని చెప్పారు. యూఏఈలో భారత రాయబారి పవన్ కపూర్ మాట్లాడుతూ, వ్యాక్సినేషన్ పొందిన భారత ప్రయాణీకులకు ఆర్టీపీసీఆర్ టెస్ట్ రద్దు చేయాల్సిందిగా కోరుతూ యూఏఈ నేషనల్ ఎమర్జన్సీ క్రైసిస్ మరియు డిజాస్టర్స్ మేనేజిమెంట్ అథారిటీని భారత అధికారులు సంప్రదించినట్లు చెప్పారు.
తాజా వార్తలు
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!







