ఎకో డ్రైవ్: రెండు ఎలక్ట్రిక్ బస్సుల్ని ప్రారంభించిన దుబాయ్
- November 13, 2021
దుబాయ్: కటింగ్ ఎడ్జ్ ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించి ట్రయల్ ప్రారంభమయ్యింది. రెండు వోల్వో 7900 వాహనాల్ని ఎంపిక చేసిన మార్గాల్లో లా మెర్ సౌత్, కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మరియు అల్ సుఫౌ ట్రామ్ స్టేషన్ల మధ్య వీటిని నడుపుతారు. రోడ్స్ మరియు ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ, వోల్వో బస్ కంపెనీ, దుబాయ్ ఎలక్ట్రిసిటీ మరియు వాటర్ అథారిటీ, మెరాస్ రియల్ ఎస్టేట్ మరియు ఎబిబి గ్రూప్ సంయుక్తంగా ఈ ఎకో ఫ్రెండ్లీ మార్గాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. ఎబిబి గ్రూపు సరఫరా చేసే స్టాండింగ్ ఎలక్ట్రిక్ చార్జర్ వీటికి వినియోగిస్తున్నారు. నైట్ ఎలక్ట్రిక్ ఛార్జర్ అల్ కోజ్ బస్ డిపో వద్ద ఏర్పాటు చేశారు. స్టాండింగ్ ఆర్మ్ ద్వారా లా మెర్ వద్ద పార్కింగ్ స్లాట్‌లో ఛార్జింగ్ చేసేలా అలాగే వైర్ ద్వారా కూడా ఛార్జింగ్ చేసేలా అవకాశం దొరుకుతుంది. 2050 నాటికి జీరో కార్బన్ ఎమిషన్స్ లక్ష్యంగా యూఏఈ పలు కార్యక్రమాలు చేపడుతోంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







