రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. 309 మంది అరెస్టు
- November 14, 2021
కువైట్: రెసిడెన్సీ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కువైట్ ప్రభుత్వం ఉక్కపాదం మోపుతుంది. నవంబర్ 6 నుండి నవంబర్ 12 వరకు మొత్తం 309 మందిపై కేసులు నమోదు చేసిన అధికారులు వారిని అరెస్టు చేశారు. ఇందులో 250 మంది రెసిడెన్సీ గడువు ముగిసిన వారు ఉండగా.. 59 మంది కన్పించకుండా పోయిన వారు ఉన్నారు. ఇదే సమయంలో 71 డ్రగ్స్, ఆల్కహాల్ సంబంధిత కేసులను కూడా నమోదు చేశారు. ఈ కేసులను నార్కోటిక్స్ కంట్రోల్ కోసం జనరల్ అడ్మినిస్ట్రేషన్‌కు రిఫర్ చేశారు. ఆరు గవర్నరేట్లలోని 256 చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టి నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన వారిని అరెస్టులు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన 80 వాహనాలను కూడా అధికారులు సీజ్ చేశారు. అన్ని గవర్నరేట్లలో తనిఖీల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు