సామాన్యుడు కోటీశ్వరుడు అయిన వేళ..

- November 16, 2021 , by Maagulf
సామాన్యుడు కోటీశ్వరుడు అయిన వేళ..

కొత్తగూడెం ప‌ట్టణానికి చెందిన స‌బ్ ఇన్‌స్పెక్టర్ బీ రాజార‌వీంద్ర ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలో పాల్గొన్నారు. 15 ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పి కోటి రూపాయ‌లు గెలుచుకున్నారు. ఈ రోమాంచిత ఎపిసోడ్ నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని కట్టిపడేసింది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక హోస్ట్ అయినటువంటి జూ.ఎన్ఠీఆర్ ఎంతో ఆనందించి రవీంద్ర సతీమణి ని కూడా వేదికపైకి పిలిచి ఇరువురిని అభినందించడం జరిగింది. 'బావా! ఐ లవ్ యు' అంటూ రవీంద్ర సతీమణి తన ఆనందాన్ని వ్యక్తపరిచి అందరి మనసులను దోచేశారు.

కాగా, రాజార‌వీంద్ర పోలీస్ డిపార్టుమెంటులో ప‌నిచేస్తూనే అనేక క్రీడా పోటీల్లో పాల్గొంటున్నారు. పోలీస్ కాంపిటిష‌న్స్‌లో ఇప్పటికే ఆయన పలు జాతీయ, అంత‌ర్జాతీయ స్థాయి అవార్డులు గెలుచుకున్నారు. ఎయిర్ రైఫిల్ షూటింగ్ విభాగంలో ఒలింపిక్స్ ప‌త‌కం గెలవాలన్నది తన కల అని ఈ ఆఫీసర్ తెలిపారు. ఎవ‌రు మీలో కోట్వీరుడు గేమ్ షోలో గెలిచిన ప్రైజ్ మ‌నీని త‌న క‌ల‌ నెర‌వేర్చుకోవ‌డానికి ఉప‌యోగించుకుంటాన‌ని ఆయ‌న చెప్పారు.

హిందీలో పాపులరైన గేమ్ షో ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ని తెలుగులో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’గా తొలుత ప్రసారం చేశారు. మా టీవీలో ఈ షో ప్రసారమయ్యేది. మొదటి 3 సీజన్లు నాగార్జున.. 4వ సీజన్ చిరంజీవి హోస్ట్ చేసారు. ఇప్పుడు దాన్ని కాస్త పేరు మార్చి ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ పేరుతో జెమినీ టీవీ ప్రసారం చేస్తోంది. దీన్ని ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్నారు. ఇక్కడ కథలు మీవి - కలలు మీవి, ఆట నాది - కోటి మీది.. అంటూ తనదైన వాక్ చాతుర్యంతో మెప్పిస్తున్నారు.

దాదాపు గ‌త రెండు నెల‌లుగా ఈ గేమ్ షో కొనసాగుతోంది. ఇప్పటివ‌ర‌కు ఎంతో మంది కంటెస్టెంట్‌లు పార్టిసిపేట్ చేశారు. అయితే వారంతా వేలు, ల‌క్షల్లో మాత్రమే న‌గ‌దు బ‌హుమ‌తి గెలుచుకోగ‌లిగారు. కొంత మంది సెలెబ్రిటీలు కూడా ఈ షోలో పార్టిసిపేట్ చేశారు. ఐతే, ఎవ‌రికీ సాధ్యం కాని చోట.. ఎస్సై రవీంద్ర అద్భుతం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com