అజ్మాన్‌లో మొదటి డ్రైవర్‌లెస్ బస్సు ప్రారంభం
- November 17, 2021
యూఏఈ: మిడిల్ ఈస్ట్ రీజియన్‌లో మొదటి ఆపరేషనల్ డ్రైవర్‌లెస్ బస్సు మంగళవారం ఉదయం అజ్మాన్‌లో ప్రారంభమైంది. అజ్మాన్ మునిసిపాలిటీ, ప్లానింగ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ షేక్ రషీద్ బిన్ హుమైద్ అల్ నుయిమి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాష్ట్ర మంత్రి ఒమర్ అల్ ఒలామా లు అజ్మాన్ కార్నిచ్‌లో ఈ బస్సు సర్వీసును ప్రారంభించి అందులో ప్రయాణించారు. ఈ బస్సులో అధిక పనితీరు గల సెన్సార్లను అమర్చారు. ఫుట్ క్రాసింగ్‌లు, ట్రాఫిక్ సిగ్నల్‌లను గుర్తించేందుకు 14 కెమెరాలు అమర్చినట్లు ఈ ప్రాజెక్ట్ కు బాధ్యత వహిస్తున్న ION ప్రాజెక్ట్ మేనేజర్ నాసిర్ అల్ షమ్సీ తెలిపారు. "ఇది దాదాపు 20 మీటర్ల దూరం నుండి క్రాసింగ్‌లు, సిగ్నల్లు గుర్తించగలదు. " అని అతను చెప్పాడు. ఈ డ్రైవర్ లెస్ బస్సులో 11 మంది ప్రయాణికులతో సహా మొత్తంగా 15 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. అజ్మాన్‌లో 3 కి.మీ. కార్నిచ్ రహదారిలోని క్రాసింగ్‌లు, సిగ్నల్ల దగ్గర బస్సులోని కెమెరాలు, సెన్సార్లకు ప్రతిస్పందించే సెన్సార్లను అమర్చినట్లు షమ్సీ వివరించారు. సమీప భవిష్యత్తులో బస్సు రన్నింగ్ దూరాన్ని 7కిలోమీటర్లకు పెంచే యోచనలో ఉన్నట్టు ఆయన తెలిపారు. మిడిల్ ఈస్ట్ లో మొట్టమొదటి డ్రైవర్‌లెస్ బస్సును ఫ్రెంచ్ కంపెనీ తయారు చేసిందని, అయితే బస్సులో వినియోగించిన టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో ఐఓఎన్లోని ఎమిరాటిస్ తన వంతు పాత్ర పోషించిందని అల్ షమ్సీ చెప్పారు. 2018లో మస్దర్ సిటీలో తొలిసారిగా బస్సును ట్రయల్ రన్ నిర్వహించామని అల్ షమ్సీ చెప్పారు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..