పునీత్ రాజ్ కుమార్ కు 'కర్ణాటక రత్న' అవార్డు
- November 17, 2021
దివంగత కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌కు కర్ణాటక ప్రభుత్వం 'కర్ణాటక రత్న' పురస్కారాన్ని అందజేయనుంది. ఈ మేరకు తాజాగా బెంగళూరులో సీఎం బసవరాజ్ బొమ్మై ప్రకటన చేశారు.
కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (కేఎఫ్సీసీ) కన్నడ సినీ నటీనటులు, సాంకేతిక నిపుణుల సంఘాలతో కలిసి ఏర్పాటు చేసిన 'పునీత నమన' సంస్మరణ సభలో సీఎం ఈ విషయాన్ని ప్రకటించారు.
పునీత్‌ను జాతీయ స్థాయి అవార్డులతో సత్కరించాలన్న అభిమానుల కోరికను కూడా రాబోయే మంత్రివర్గంలో పరిశీలిస్తామని సీఎం బసవరాజ్ తెలిపారు. పునీత్ కర్నాటక ప్రభుత్వ అత్యున్నత పౌర పురస్కారమైన 'కన్నడ కంఠీర్వ' 10వ గ్రహీత. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించింది. పునీత్ పేరును 'పద్మశ్రీ' అవార్డుకు సిఫార్సు చేయాలని సిఎంను అభ్యర్థించింది.
46 ఏళ్ల వయసులో పునీత్ అక్టోబరు 29న భారీ గుండెపోటుతో మరణించారు. అక్టోబరు 31న బెంగళూరులోని కంఠీరవ స్టూడియోస్‌లో ఆయన తండ్రి, తల్లి సమాధి పక్కన పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మరణానంతరం పునీత్ రాజ్‌కుమార్ ఈ అత్యున్నత పురస్కారం ప్రకటించడం పట్ల ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?