హీరో సుధీర్: కేటీఆర్ మంచి లీడరే కాదు.. మంచి యాక్టర్ కూడా
- November 17, 2021
హైదరాబాద్ నగరంలోని హైటెక్స్‌లో ఇండియా జాయ్ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో హీరో సుధీర్ బాబు తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కేటీఆర్‌కు తాను పెద్ద అభిమానిని అన్ని అన్నారు. కేటీఆర్ ఒక మంచి రాజకీయ నాయకుడని పేర్కొన్నారు. ఒక నటుడు అన్నీ మర్చిపోయి రోల్‌కు తగ్గట్లుగా నటించినట్లే.. రాజకీయ నాయకుడు ప్రజలకు మంచి చేయాలంటే తన కుటుంబం గురించి మర్చిపోయి పని చేయాలని సుధీర్ బాబు అన్నారు. కేటీఆర్ కూడా అలానే పని చేస్తారని, తాను కూడా భవిష్యత్‌లో రాజకీయ నాయకుడిగా నటించే ఛాన్స్ వస్తే కేటీఆర్‌ను అనుసరస్తానని తెలిపారు. సినిమాల్లోకి కేటీఆర్ రానందుకు ఆనందంగా ఉందని సుధీర్ బాబు నవ్వుతూ అన్నారు.
అదే కార్యక్రమంలో ఉన్న మంత్రి కేటీఆర్.. సుధీర్ బాబు వ్యాఖ్యలను ఆసక్తిగా విన్నారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. సుధీర్ తనను అనుకోకుండా నటుడిని చేశాడని, తనను రాజకీయ నాయకుడిగా కంటే నటుడిగా బాగుంటావని అన్నాడని అన్నారు. తాను రాజకీయ నాయకుడిగా కాకుండా నటుడిగా కనిపిస్తున్నానా.. ఎంటీ సుధీర్ అంటూ ప్రశ్నించారు. ఇది తాను మనసులో పెట్టుకుంటున్నానని, ఈ విషయాన్ని తాను చాలా పాజిటివ్ వేలో చూస్తున్నానని తెలిపారు. సుధీర్ ప్రశంసను స్వీకరిస్తున్నానని మంత్రి కేటీఆర్ నవ్వుతూ సమాధానం చెప్పారు. వీరి మధ్య జరిగిన సంభాషణ అక్కడున్న వారికి నవ్వులు పూయించింది. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో తెలంగాణ వీఎఫ్‌ఎక్స్, యానిమేషన్ అండ్ గేమింగ్ అసోసియేషన్ 'ఇండియా జాయ్' ఫెస్టివల్‌ను నిర్వహిస్తోంది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!