ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ గా గంగూలీ
- November 17, 2021
టీమిండియా మాజీ క్రికెటర్, బిసిసిఐ ప్రస్తుత అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కి అరుదైన గౌరవం లభించింది. ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్ గా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బుధవారం నియామకం అయ్యారు.
మంగళవారం దుబాయ్‌లో జరిగిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బోర్డు సమావేశం లో ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్ గా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని నియామకం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
గత కొన్ని ఏళ్లుగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. క్రికెట్ కు చేస్తున్న.. సేవలకు ఈ పదవి ఇస్తున్నట్లు స్పష్టం చేసింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ).
ఐసిసి పురుషుల క్రికెట్ కమిటీ అధ్యక్ష పదవికి సౌరవ్‌ను స్వాగతిస్తున్నందుకు తాను సంతోషిస్తున్నానని… ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు గంగూలీ అని ICC ఛైర్మన్ గ్రెగ్ బార్క్లే అన్నారు. ఈ పదవి కి సౌరవ్ గంగూలీ.. చాలా భాగా సెట్ అవుతాడని పేర్కొన్నారు. ఇక అటు బీసీసీఐ సభ్యులతో పాటు.. క్రికెటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







