ఆత్మహత్యాయత్నం చేసినవారిని బహిష్కరించడం చట్ట విరుద్ధం

- November 17, 2021 , by Maagulf
ఆత్మహత్యాయత్నం చేసినవారిని బహిష్కరించడం చట్ట విరుద్ధం

కువైట్: అసిస్టెంట్ లా ప్రొఫెసర్ (కువైట్ యూనివర్సిటీ) ఫవాజ్ అల్ ఖాతిబ్, ఆత్మహత్యాయత్నం చేసినవారిని దేశం నుంచి బహిష్కరించడం చట్ట విరుద్ధమని చెప్పారు. ఆత్మహత్యాయత్నం అనేది బాధితుల మానసిక సమస్య కారణంగా జరుగుతుందని ఆయన అన్నారు. అయితే, బలవన్మరణానికి పాల్పడాలన్న ఆలోచన చేసేవారికి 3 ఏళ్ళ వరకు జైలు శిక్ష పడే అవకాశం వుంది ఆర్టికల్ 158 పీనల్ కోడ్ 16ఉ1960 ప్రకారం. ఆత్మహత్యాయత్నం చేసినవారికి కౌన్సిలింగ్ ఇవ్వాల్సి వుంటుందనీ, అలాంటివారిని గుర్తించి తగిన వైద్య చికిత్స కూడా అందించాలనీ, దానికి బదులుగా డిపోర్టేషన్.. అంటూ బెదిరింపులకు పాల్పడటం సబబు కాదని ప్రొఫెసర్ ఫవాజ్ అల్ ఖాతిబ్ అభిప్రాయపడ్డారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com