షార్జాలో ప్లాంట్ ను ప్రారంభించిన మొదటి ఇండియన్ చమురు సంస్థ
- November 18, 2021
షార్జా: షార్జాలో ఇండియన్ చమురు సంస్థ అయిన సిద్ధార్థ్ గ్రీస్ అండ్ లూబ్స్ వాళ్ల సబ్సిడరీ ట్రినిటి లూబ్స్ అండ్ గ్రీస్ తన ప్లాంట్ ను ప్రారంభించింది. షార్జాలోని హమరియా ఫ్రీ జోన్ అథారిటీ పోర్ట్ లో దీన్ని ఏర్పాటు చేశారు. భారత పెట్రోలియం శాఖ మంత్రి హరిదీప్ సింగ్ పూరి ఈ ప్లాంట్ ను ఓపెన్ చేశారు. షార్జా లో భారత్ కు చెందిన చమురు ప్లాంట్ ను ప్రారంభించటం ఇదే తొలిసారి కావటం విశేషం. దాదాపు 50 మిలియన్ల దిర్హామ్స్ ను ప్లాంట్ ఏర్పాటు కోసం ఇన్వెస్ట్ చేశారు. మొత్తం 12, 500 స్క్వేర్ మీటర్ల పరిధిలో ఉన్న ఈ ప్లాంట్ లో ఏటా 50 మిలియన్ల లీటర్ల గ్రీస్, చమురును ఉత్పత్తి చేయనున్నారు. ఈ ప్లాంట్ పూర్తిగా ఆటోమేటేడ్. ఆటోమెబైల్, ఇండస్ట్రీస్ కావాల్సిన చమురుతో పాటు ఎలక్టిక్ వెహికల్స్ అవసరమైన ఆయిల్ ఇక్కడ ఉత్పత్తి చేయనున్నారు.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







