మాస్క్ లు ధరించటంలో నిర్లక్ష్యం. పెరుగుతున్న కరోనా కేసులు

- November 19, 2021 , by Maagulf
మాస్క్ లు ధరించటంలో నిర్లక్ష్యం. పెరుగుతున్న కరోనా కేసులు

గల్ఫ్ : కరోనా మహమ్మరి గత ఏడాదిలో ఎంత విలయం తాడవం సృష్టించిందో అందరికీ తెలిసిందే. దీని ఎఫెక్ట్ తో ప్రపంచం మొత్తానికి ఎన్నో కొత్త సవాళ్లు పుట్టుకొచ్చాయి. చాలా కొత్త విషయాలను నేర్పింది. ముఖ్యంగా క్లీన్ నెస్ అనేది ఎంతో కీలకం కరోనా కారణంగా ప్రపంచానికి తెలిసివచ్చింది. కరోనా ను తగ్గించేందుకు మందులు, ట్రీట్ మెంట్ చేయని పనిని కూడా ఒక్క మాస్క్ పెట్టుకోవటం, శానిటైజేషన్ చేసుకోవటం ద్వారా సాధ్యమైంది. దీంతో చాలా వరకు కరోనా ఎఫెక్ట్ తగ్గింది. అదే జనాల్లో నిర్లక్ష్యానికి కారణమవుతోంది. కరోనా తగ్గింది కదా అని మాస్క్ పెట్టుకోవటంలో చాలా మంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. మళ్లీ కరోనా మహమ్మరి వ్యాప్తి చెందేందుకు కారణమవుతున్నారు. కొంతకాలంగా మాస్క్ పెట్టుకోవటంలో ప్రపంచ వ్యాప్తంగా జనం కేర్ లెస్ గా ఉంటున్నారంట. దాదాపు 30 సంస్థలు చేసిన స్టడీలో ఇదే విషయం వెల్లడైంది. దీంతో డబ్ల్యూహెచ్ఓ సహా చాలా ఆరోగ్య సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మాస్క్, శానిటైజేషన్, ఫిజికల్ డిస్టెన్స్ విషయంలో అన్ని దేశాలు కఠినంగా వ్యవహారించాలని సూచిస్తున్నాయి. మాస్క్ పెట్టుకోవటం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా 53 శాతం కరోనా కేసులను తగ్గించగలిగారు. 25 శాతం ఫిజికల్ డిస్టెన్స్ మెయింటెన్ చేయటం ద్వారా కోవిడ్ కేసులు తగ్గాయి. మళ్లీ జనం నిర్లక్ష్యంగా ఉంటుండటంతో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీనిపై ఎక్స్ ఫర్ట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com