ప్రభుత్వ ఉద్యోగికి లంచం ఇచ్చిన వ్యక్తికి జైలు శిక్ష
- November 19, 2021
యూఏఈ: చట్టవిరుద్ధంగా ప్రభుత్వ లావాదేవీని క్లియర్ చేయాలని ఆ వ్యక్తి ప్రభుత్వ అధికారిని ప్రలోభ పెట్టాలని చూశాడు. కానీ దీన్ని తీవ్రంగా భావించిన సదరు ఉద్యోగి లంచం ఆఫర్ చేసిన వ్యక్తిని పోలీసులకు పట్టించింది. ప్రభుత్వ కేంద్రంలోని కస్టమర్ సర్వీస్ ఉద్యోగికి 10,000 దిర్హామ్ లంచం ఇచ్చినందుకు ఆసియా పెట్టుబడిదారుడికి ఏడాది జైలు శిక్ష పడింది. పోలీసుల విచారణ ప్రకారం.. ప్రభుత్వ లావాదేవీలను క్లియర్ చేసే డిపార్టుమెంట్ లో గతేడాది జూలైలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇన్వెస్టర్ కంపెనీని కమర్షియల్ లైసెన్స్ నుండి ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ మేనేజ్‌మెంట్‌గా మార్చడానికి బదులుగా క్లయింట్లలో ఒకరు తనకు Dh10,000 లంచంగా ఇస్తానని ఆఫర్ ఇచ్చాడు. ఈ ప్రక్రియ చట్టవిరుద్ధమని, సంబంధిత అధికారుల ఆమోదం లేకుండా అలాంటి లావాదేవీని నిర్వహించలేమని ఆమె ఆ వ్యక్తికి చెప్పింది. అయినా క్లయింట్ మార్పు కోసం పదేపదే అభ్యర్థించినప్పటికీ, ఆమె నిరాకరించింది. లావాదేవీని క్లియర్ చేయడానికి అతను ఆమెకు కారు కూడా ఇస్తానని ఆఫర్ ఇచ్చాడు. కానీ ఆమె అతని అభ్యర్థనను పట్టించుకోలేదు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోగా.. పోలీసులకు ఫిర్యాదు చేయమని చెప్పారు. పోలీసుల సూచనల మేరకు.. లావాదేవీని క్లియర్ చేయమని దోషి మరోసారి ఉద్యోగిని కోరినప్పుడు, ఆమె Dh10,000 అంగీకరించడానికి అంగీకరించినట్లు నటించింది. దీంతో పోలీసులు ఆ వ్యక్తిని మెరుపుదాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని కేసు పెట్టారు.
తాజా వార్తలు
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్‌లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్‌లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్‌లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్‌లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్‌కు? సమ్మర్ బ్రేక్‌కు ముందే క్లారిటీ..!!







