సౌదీలో భారీ సోలార్ ప్యానెల్ ఫ్యాక్టరీ ప్రారంభం
- November 19, 2021
సౌదీ అరేబియా : సోలార్ విద్యుత్ ప్రొడక్షన్ లో సౌదీ మరో ముందడుగు వేసింది. దేశంలోనే అతి పెద్ద సోలార్ ప్యానెల్స్ ఫ్యాక్టరీని ప్రారంభించింది. ఇండస్ట్రీయల్ సిటీ ఆఫ్ తుబాక్ లో దీన్ని ప్రారంభించారు. ఈ సోలార్ ప్యానెల్స్ ద్వారా సోలార్ విద్యుత్ తయారీ మరింత పెరగనుంది. మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికా (MENA) రీజన్ లో ఉన్న అతి పెద్ద సోలార్ ప్యానెల్స్ ఫ్యాక్టరీ కెపాసిటీ ఎంత ఉందో ఇక్కడి ఫ్యాక్టరీలోనూ అంతటి ఉత్పత్తి సామర్థ్యం ఉంది. ఈ సంస్థ కోసం 700 మిలియన్ల రియాల్ ఇన్వెస్ట్ చేశారు. 27000 స్క్వేర్ మీటర్స్ పరిధిలో ఉన్న ఈ ఫ్యాక్టరీ లో ఏటా 1.2 గిగావాట్ల సామర్థ్యం గల విద్యుత్ ను ఉత్పత్తి చేయనున్నారు. తుబాక్ లోని ఇండస్ట్రీయల్ ఏరియాలో ఇలాంటి మరిన్ని పెద్ద సంస్థలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని సౌదీ తెలిపింది. దీని ద్వారా దేశంలోని యువత ఉద్యోగావశాలకు వస్తాయని ప్రకటించింది.
తాజా వార్తలు
- దక్షిణాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోయిన భారత్
- వాహనాల పైకప్పుల పై కూర్చోవడం డేంజర్, క్రైమ్..!!
- సోహార్లో చోరీ కేసులో ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో బెగ్గర్ అరెస్ట్.. నగదు చూసి పోలీసులు షాక్..!!
- సౌదీ అరేబియాలో 14,893 మంది బహిష్కరణ..!!
- ట్రాన్సిట్, టూరిజం పాలసీపై సమీక్షకు సన్నాహాలు..!!
- ప్రవాసుల లా సేవల పై కువైట్ బార్ అసోసియేషన్ సీరియస్..!!
- భారతీయ విశ్వవిద్యాలయాలు ‘రోబోడాగ్’ నుంచి ఏం నేర్చుకోవాలి: BITS వైస్ ఛాన్సలర్ రాంగోపాల్ రావు
- ట్రంప్ టారిఫ్ దెబ్బ, దిగుమతుల పై 15% సుంకం ప్రకటింపు
- టీబీజేపీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అరెస్ట్..









