వివిధ విభాగాలు, ప్రొఫెషన్లకు వీసా ఆప్షన్లు
- November 19, 2021
యూఏఈ: యూఏఈ ప్రభుత్వం, వివిధ నైపుణ్యాలు కలిగినవారికోసం ప్రత్యేకంగా సరికొత్త వీసా స్కీమ్స్ అందుబాటులోకి తెచ్చేందుకు సంసిద్ధమవుతోంది. ఆయా రంగాల్లో నిష్ణాతులకు, నైపుణ్యవంతులకు యూఏఈ స్వర్గధామం. ఈ నేపథ్యంలో వారిని మరింతగా ఆకర్షించేందుకు కొత్త వీసా స్కీమ్స్ ప్రవేశ పెట్టబోతున్నారు. ఐదేళ్ళ మల్టీ ఎంట్రీ వీసా సౌకర్యాన్ని మల్టీనేషనల్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు నవంబర్ 16న ప్రకటించడం జరిగింది. ఈ వీసా 90 రోజులపాటు చెల్లుబాటవుతుంది. దాన్ని 90 రోజులపాటు పొడిగించుకునే అవకావం వుంటుంది. 2019లో గోల్డెన్ వీసాని పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలకు, ప్రత్యేకమైన నైపుణ్యాలు కలిగినవారికి, రీసెర్చర్స్కీ, టాప్ స్టూడెంట్స్కీ ప్రకటించారు. 100 శాతం బిజినెస్ ఓనర్షిప్ కలిగి వుండేలా, స్పాన్సర్ అవసరం లేకుండా నివసించేలా ఈ గోల్డెన్ వీసా అవకాశం కల్పిస్తుంది. గ్రీన్ వీసాని సెప్టెంబర్ 21న ప్రకటించారు. అత్యు్న్నత స్థాయి నైపుణ్యాలు కలిగినవారికి దీన్ని మంజూరు చేస్తారు. ఫ్రీలాన్సర్ వీసా పేరుతో సెల్ఫ్ ఎంప్లాయ్డ్ వర్కర్లకు అవకాశం కల్పిస్తున్నారు. మల్టిపుల్ ఎంట్రీ టూరిజం వీసా ద్వారా 90 రోజులపాటు వెసులుబాటు దొరుకుతుంది. దీన్ని మరో 90 రోజులకు పొడిగించుకోవచ్చు. రిమోట్ వర్క్ వీసా మార్చి 2021లో ప్రకటించారు. రిటైర్మెంట్ వీసా, టెంపరరీ వర్క్ పర్మిట్, సిటిజన్షిప్ సహా పలు వీసాల్ని యూఏఈ అందిస్తోంది.
తాజా వార్తలు
- వాహనాల పైకప్పుల పై కూర్చోవడం డేంజర్, క్రైమ్..!!
- సోహార్లో చోరీ కేసులో ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో బెగ్గర్ అరెస్ట్.. నగదు చూసి పోలీసులు షాక్..!!
- సౌదీ అరేబియాలో 14,893 మంది బహిష్కరణ..!!
- ట్రాన్సిట్, టూరిజం పాలసీపై సమీక్షకు సన్నాహాలు..!!
- ప్రవాసుల లా సేవల పై కువైట్ బార్ అసోసియేషన్ సీరియస్..!!
- భారతీయ విశ్వవిద్యాలయాలు ‘రోబోడాగ్’ నుంచి ఏం నేర్చుకోవాలి: BITS వైస్ ఛాన్సలర్ రాంగోపాల్ రావు
- ట్రంప్ టారిఫ్ దెబ్బ, దిగుమతుల పై 15% సుంకం ప్రకటింపు
- టీబీజేపీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అరెస్ట్..
- శ్రీశైలంలో అగ్ని ప్రమాదం, భక్తులకు తప్పిన పెను ప్రమాదం









