మహిళా ప్రయాణీకురాలి అభ్యర్థనకు స్పందించిన వీసి సజ్జనార్..కీలక ఉత్తర్వులు జారీ
- November 19, 2021
ఆర్టీసి బలోపేతానికి నడుం బిగించిన ఎండీ వీసి సజ్జనార్ అటు కార్మికుల సంక్షేమంతో పాటు ఇటు ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని అనేక కీలక నిర్ణయాలు వెనువెంటనే తీసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా ఓ మహిళా ప్రయాణికురాలు రాత్రిపూట చేసే ప్రయాణాయాల్లో మహిళల ఇబ్బందులపై ఫిర్యాదు చేశారు. అత్యవసరాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నట్టు వివరించారు. దీంతో స్పందించిన సజ్జనార్ ప్రయాణికులు అత్యవసర సమయాల్లో బస్సును ఆపవచ్చంటూ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో పాటు టోల్‌ప్లాజాల వద్ద అక్కడున్న సదుపాయాలు ఉపయోగించుకునే విధంగా వినియోగించుకోవాలని డ్రైవర్స్ బస్సులో అనౌన్స్ చేయాలని పేర్కోన్నారు. దూర ప్రాంతాల ప్రయాణాల సమయంలో ప్రయాణికుల కోసం దాబాలు, హోటళ్ల వద్ద బస్సును నిలపాలని ఉత్తర్వుల్లో పేర్కోన్నారు.
కాగా ఇప్పటికే ప్రయాణికుల కోసం పలు నిర్ణయాలను ఆయన ప్రకటించారు. బస్సులో సౌకర్యాల ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు ఏకంగా డబ్బై కిలోమీటర్ల మేర ఎక్స్‌ప్రెస్ బస్సులో ప్రయాణించి ప్రయాణికు ఇబ్బందులను నేరుగా తెలుసుకునే ప్రయత్నించారు. ఇక బస్‌స్టాండ్‌లలోని వస్తువులను అధిక ధరలకు విక్రయించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎమ్‌ఆర్‌పీ ధర కంటే అదనంగా వసూలు చేయవద్దని చెప్పారు. ఇక ఆర్టీసీలో డిజిటల్ చెల్లింపులకు కూడా ఆయన శ్రీకారం చుట్టారు.
దీంతో పాటు చిల్లర సమస్యను పై ఓ ప్రయాణికుడు చేసిన ట్విట్‌కు స్పందించి ఆర్టీసీ నష్టపోయిన పర్వాలేదు కాని, ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని చిల్లర సమస్యను తగ్గించారు.మరోవైపు ఓ విద్యార్థి టికెట్ తీసుకుని కండక్టర్ వద్ద చిల్లరను తీసుకోవడం మరచిపోవడంతో విషయాన్ని ఆయన దృష్టికి తీసుకుని వెళ్లాడు. దీంతో వెంటనే స్పందించిన సజ్జనార్ ఆ విద్యార్థికి తిరిగి చిల్లర డబ్బులను ఇప్పించే ఏర్పాట్లను చేశారు. ఇలా ప్రయాణికులు ఏ సమస్యపై విన్నవించినా వెంటనే స్పందించి నిర్ణయాలను అమలు పరుస్తుండడంతో ప్రయాణికుల మన్ననలు పొంది లాభాల భాటలోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఆయన ముందుకు వెళుతున్నారు.
తాజా వార్తలు
- భారత చిన్నారుల విద్య కోసం జీవితాన్ని అంకితం చేసిన శాండ్రా
- శ్రీవారి భక్తులకు అలర్ట్..ఆగస్టు 1 నుండి పుష్కరిణి మూసివేత!
- విద్యాసంస్థల్లో డ్రగ్స్ నిర్మూలనకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- గోవాలో జూలై 25–27 వరకు ‘యూత్ ఐకానిక్ ఎంటర్‌ప్రెన్యూర్స్ సమ్మిట్–2026’
- ఎన్ఆర్ఐ సర్టిఫికెట్ల కోసం అత్యవసర సేవలు.. దుబాయ్‌లోని భారత కాన్సులేట్ కీలక ప్రకటన..!!
- ఖతార్‌లో మరో మూడు సంవత్సరాల పాటు ONE ఛాంపియన్షిప్ పోటీలు..!!
- షైఖ్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై రాకపోకలపై ఆంక్షలు..!!
- సముద్ర భద్రత, నౌకాయాన స్వేచ్ఛకు ఒమాన్ మద్దతు..!!
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..







