న్యూయార్క్‌ టైమ్‌ స్క్వేర్‌ బిల్‌బోర్డుపై ఇళయరాజా..

- November 20, 2021 , by Maagulf
న్యూయార్క్‌ టైమ్‌ స్క్వేర్‌ బిల్‌బోర్డుపై ఇళయరాజా..

మ్యూజిక్‌ మ్యాస్ట్రో ఇళయరాజా పరిచయం అవసరంలేని పేరు. ఆయన సంగీతం  గురించి అభిమానులకు, సినిమా ప్రేక్షకులకు తెలిసిందే. ఇటీవల న్యూయార్క్‌ నగరంలోని టైమ్స్‌ స్క్వేర్‌ బిల్‌బోర్డుపై ఆయన ముఖ చిత్రంతో ఉన్న బ్యానర్‌ను  ప్రదర్శించారు. స్వరకర్త ఇళయరాజా అధికారిక ఫేస్‌బుక్‌ పేజీలో ఈ విషయాన్ని ప్రకటించారు. మ్యూజికల్‌ స్ట‍్రీమింగ్ సర్వీస్‌ అయిన స్పూటిఫై ప్రచారంలో భాగంగా ఇలా ప్రదర్శించారు. న్యూయార్క్‌లో ఇసైజ్ఞాని (మ్యూజికల్‌ జీనియస్‌) ఇళయరాజా పోస్టర్‌ను చూసి ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com