ఆసక్తి రేపుతున్న నాగ చైతన్య పోస్ట్
- November 20, 2021
నాగ చైతన్య సమంత నుండి విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత మొదటిసారి ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టాడు. దాదాపు 45 రోజుల తర్వాత అతగాడు చేసిన మొదటి పోస్ట్ ఇది. హాలీవుడ్ నటుడు మ్యాథ్యూ మెక్కోనాగే రాసిన ‘గ్రీన్లైట్స్’ పుస్తకాన్ని చదవుతున్నట్లు చెప్పకనే చెప్పాడు తన పోస్ట్ ద్వారా. జీవితం పట్ల తన దృక్పధాన్ని వివరిస్తూ ఓ జ్ఞాపకంలా మ్యాథ్యూ ఈ అప్రోచ్ బుక్ ను తీర్చిదిద్డాడు. ప్రతి ఒక్కరూ జీవితంలో ముందుకు పోవడానికి అనువైన పరిస్థితులను వివరించటానికి మ్యాథ్యూ గ్రీన్లైట్స్ ను ఉపయోగించాడు. ఇప్పుడు చైతన్య ఈ పుస్తకాన్ని చదువుతున్నట్లు చెప్పాడు.
‘జీవితానికి ప్రేమలేఖ.. మీ ప్రయాణాన్ని పంచుకున్నందుకు @officiallymcconaughey ధన్యవాదాలు.. ఈ పుస్తక పఠనం నాకు గ్రీన్ లైట్.. గౌరవం సార్!’ అని పుస్తకం కవర్ ఫోటో షేర్ చేస్తూ పోస్ట్ పెట్టాడు నాగచైతన్య. ఇదిలా ఉంటే త్వరలో నాగ చైతన్య హారర్ నేపథ్యంలో వెబ్ సిరీస్ చేయబోతున్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘థ్యాంక్యూ’ సినిమా తర్వాత ఈ సీరీస్ ఆరంభం కానుంది. హారర్ సీరీస్ కి కూడా విక్రమ్ కుమార్ దర్శకత్వ వహించనుండటం విశేషం.
తాజా వార్తలు
- T20 వరల్డ్ కప్ 2026: ఒమన్ పై ఆస్ట్రేలియా ఘన విజయం
- టీటీడీలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- మేకపాటి గౌతమ్ పేరుతో ధ్యాన మందిరం
- డొనాల్డ్ ట్రంప్‌కి బిగ్ షాక్..
- హైవే పై గ్యాస్ ట్యాంకర్ పేలుడు
- ‘PhonePe’లో అదిరిపోయే ఫీచర్!
- మదీనాలో ఆరోగ్య , వాణిజ్య కార్యకలాపాలలో తనిఖీలు..!!
- మూడు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్సులు రద్దు..!!
- BD4,633 సైక్లింగ్..ప్రవాసురాలికి జైలుశిక్ష ఖరారు..!!
- యూఏఈలో లైసెన్స్ లేని, నకిలీ సంస్థలను ఎలా గుర్తించాలి?









