ఈ నెల 24 న ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్ కార్యక్రమం

- November 21, 2021 , by Maagulf
ఈ నెల 24 న ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో  ఓపెన్ హౌస్ కార్యక్రమం

కువైట్: కోవాగ్జిన్ సర్టిఫికెట్ తో పాటు పలు అంశాలపై చర్చించడానికి బుధవారం ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్ ఏర్పాటు చేసింది. ఇండియన్ ఎంబసీ అంబాసిడర్  సిబి జార్జ్‌తో నవంబర్24, 2021(బుధవారం) మధ్యాహ్నం 03.30 గంటలకు ఎంబసీ ఆడిటోరియంలో ఓపెన్ హౌజ్ జరుగనుంది. ఇందులో భారతీయ పాస్‌పోర్ట్ ల అప్‌డేట్, భారతీయ వీసాల నవీకరణ, COVAXIN వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై చర్చించనున్నారు.  కువైట్‌లోని భారతీయ పౌరులందరు ఓపెన్ హౌస్ లో పాల్గొనవచ్చని వెల్లడించారు. ఆసక్తి ఉన్నవారు [email protected]కి ఇమెయిల్ పంపడం ద్వారా పేర్లను నమోదు చేసుకోవచ్చు. COVID-19 వ్యాక్సిన్ పూర్తి డోసులు తీసుకున్న వారికి మాత్రమే అనుమతి ఇస్తారు. నిర్దిష్ట సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలనుకున్న వారు తమ ప్రశ్నలను, పాస్‌పోర్ట్ లో ఉన్నట్లు పూర్తి పేరు, పాస్‌పోర్ట్ నంబర్, సివిల్ ఐడి నంబర్, కువైట్‌లోని కాంటాక్ట్ నంబర్, చిరునామాతో ఈమెయిల్ ద్వారా [email protected]కి పంపవచ్చు. వాలంటీర్‌గా సేవలు అందించేందుకు నమోదు చేసుకున్న వారందరూ కూడా ఓపెన్ హౌజ్ లో పాల్గొనాలని ఎంబసీ కోరింది. ఈ ఓపెన్ హౌస్ వర్చువల్ ప్లాట్‌ఫారమ్‌లో కూడా హోస్ట్ చేయబడుతుంది. వర్చువల్ ఓపెన్ హౌస్ కోసం జూమ్ లింక్: https://zoom.us/j/99832801639?pwd=MlRKeDJxaWxmMGkybmxZR0JZc2Nqdz09

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com