విశాఖపట్నం నావల్ డాక్‌యార్డ్‌లో అప్రెంటిస్ పోస్టులు..
- November 21, 2021
విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్ అప్రెంటిస్ స్కూల్.. వివిధ ట్రేడుల్లో ఉన్న అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఈ సంస్థలో మొత్తం 275 ఖాళీలను ఉన్నాయి. ఏయో ట్రేడుల్లో ఖాళీలు ఉన్నాయి, ఎవరు అర్హులు అన్న పూర్తి వివరాలు..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
- నోటిఫికేషన్లో భాగంగా ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్, పెయింటర్ ట్రేడుల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.
- పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పదో తరగతి 50 శాతం మార్కులతో తోపాటు 65 శాతం మార్కులతో సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
- అభ్యర్థుల వయసు 01.04.2001 నుంచి 01.04.2008 మధ్య జన్మించి ఉండాలి.
- ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్/ ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అభ్యర్థులు తమ దరఖాస్తులను నావల్ డాక్‌యార్డ్ అప్రెంటిస్ స్కూల్, వీఎం నావల్ బేస్ ఎస్.ఓ, పీ.ఓ. విశాఖపట్నం–530014, ఆంధ్రప్రదేశ్ అడ్రస్‌కు పంపించాలి.
- అభ్యర్థులను రాతపరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
- పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థుల్ని ఇంటర్వ్యూకు పిలుస్తారు.
- ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు 05-12-2021, దరఖాస్తు హార్డ్ కాపీ పంపడానికి 14-12-2021ని తేదీగా నిర్ణయించారు.
- రాత పరీక్షను 27.01.2022న నిర్వహించనున్నారు.
పూర్తి వివరాల కోసం ఈ క్రింద లింకు క్లిక్ చేయండి..
తాజా వార్తలు
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం