మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించిన ఏపీ ప్రభుత్వం..
- November 22, 2021
అమరావతి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లు ఉపసంహరిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్వొకేట్ జనరల్ స్వయంగా హైకోర్టుకు తెలిపారు. ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశంలోనూ మూడు రాజధానులపైనే చర్చ జరిగింది. అయితే, మూడు రాజధానులపై ప్రభుత్వం వెనక్కు తగ్గిందా లేదా తన వ్యూహం మార్చిందా అన్నదే అంతుపట్టడం లేదు. మూడు రాజధానులపై టెక్నికల్‌గా సమస్యల్ని పరిష్కరించి మళ్లీ బిల్లులు పెడతారా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సాగు చట్టాల్ని రద్దు చేస్తూ మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఏపీ సీఎం జగన్ కూడా అదే బాటలో వెళ్తున్నారా అనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే, అమరావతికి మద్దతుగా వెళ్లాలని ఏపీ బీజేపీ నేతలకు అమిత్‌షా ఆదేశాలు జారీ చేశారు.
బీజేపీ నేతలకు అమిత్‌షా ఆదేశాల నేపథ్యంలోనే వైసీపీ సర్కార్ ప్లాన్ మారిందా అన్న చర్చ పొలిటికల్ సర్కిల్లో జరుగుతోంది. ఉన్నట్టుండి మూడు రాజధానులపై వెనక్కి తగ్గడానికి కారణాలేంటనే దానిపై ప్రభుత్వం గాని, వైసీపీ నేతలు గాని ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం అమరావతిపై హైకోర్టులో రోజువారీ విచారణ జరుగుతోంది. విచారణ సందర్భంగా మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకుంటున్నట్టు ఏజీ కోర్టుకు తెలిపారు. సీఎం జగన్ మరికాసేపట్లో అసెంబ్లీలో అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
తాజా వార్తలు
- లైసెన్స్ లేకుండా సేవలందిస్తే..SR2,600 ఫైన్..!!
- విడాకుల కేసులు పెరగడంపై షురా కౌన్సిల్ ఆందోళన..!!
- అలెర్ట్..ఉమ్ అల్ హౌల్ ఇంటర్‌చేంజ్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఆన్లైన్ బెగ్గింగ్ మోసాలపై దుబాయ్ పోలీసుల వార్న్..!!
- రమదాన్..ధరల పర్యవేక్షణకు ముమ్మర తనిఖీలు..!!
- కింగ్ ఫైసల్ రోడ్డులో రెండు లేన్లు మార్చి 29 వరకు మూసివేత..!!
- T20WorldCup2026: ఆస్ట్రేలియా ఇంటికే..!
- ఢిల్లీలో AI సమ్మిట్ ప్రారంభం
- కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్లు వీళ్లే
- 'రాయల్' ఫోటోగ్రాఫర్ రమేష్ శుక్లాకు షేక్ హమ్దాన్ నివాళి..!!









