రియాద్‌లో GCC యూనిఫైడ్ మిలిటరీ కమాండ్ ప్రధాన కార్యాలయం ప్రారంభం
- November 23, 2021
సౌదీ: GCC యూనిఫైడ్ మిలిటరీ కమాండ్ కొత్త ప్రధాన కార్యాలయాన్ని సౌదీ క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ ప్రీమియర్, రక్షణ మంత్రి, హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌదీ ఆధ్వర్యంలో రియాద్‌లో సోమవారం ప్రారంభించారు. హెచ్‌ఆర్‌హెచ్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ తరపున సౌదీ డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్ హెచ్‌ఆర్‌హెచ్ ప్రిన్స్ ఖలీద్ బిన్ సల్మాన్ అల్ సౌద్, GCC రక్షణ మంత్రులు, జీసీసీ సెక్రటరీ జనరల్ డాక్టర్ నయీఫ్ ఫలాహ్ ముబారక్ అల్-హజ్రఫ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీసీసీ సెక్రటరీ జనరల్ డాక్టర్ అల్ హజ్రఫ్ మాట్లాడుతూ.. సైనిక ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించినందుకు GCC నాయకులను అభినందించారు. అన్ని రంగాలలో ఉమ్మడి గల్ఫ్ దేశాల మధ్య పరస్పర మద్దతు ఆవశ్యకతను ఆయన వివరించారు. మిలిటరీ హబ్ ప్రారంభోత్సవంతో భవిష్యత్తులో శాంతిని నెలకొల్పడంతోపాటు GCC భద్రతను, స్థిరత్వాన్ని పెంచుతుందన్నారు. బయటి నుంచి వచ్చే ముప్పు నుంచి జీసీసీ దేశాలను కాపాడాలనే దృఢ సంకల్పాన్ని ఇది సూచిస్తోందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- జర్మనీలో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ అవకాశం..
- ముగిసిన తెలంగాణ ‘ఈ కేబినెట్’ భేటీ.. మూసీ ప్రాజెక్టు ఫేజ్-1కు ఆమోదం
- దుబాయ్‌లో ట్యాక్సీ డ్రైవర్లకు భారీ ఉద్యోగావకాశం
- భారత్-జపాన్ AI ఒప్పందం: టెక్ రంగంలో భారీ మార్పులు
- విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్..
- తెలుగు రాష్ట్రాలకు వాతావరణ హెచ్చరిక.. 7 రోజుల పాటు భారీ వర్షాలు
- యూఏఈ ఎమిరేట్స్ ఐడితో ఫ్రాడ్ రిస్క్..డేటా ప్రొటెక్షన్ గైడ్..!!
- ఇరాన్ దురాక్రమణ పై యూఎన్ఓలో బహ్రెయిన్ ఫైర్..!!
- ఉత్తర అల్ షర్కియాలో భారీగా పొగాకు ఉత్పత్తులు స్వాధీనం..!!
- సౌదీలో లేబర్ తనిఖీలు.. 80వేల సౌదీకరణ ఉల్లంఘనలు..!!







