వాహనాల్ని అద్దె ప్రాతిపదికన తీసుకునేందుకు నిబంధనలు

- November 23, 2021 , by Maagulf
వాహనాల్ని అద్దె ప్రాతిపదికన తీసుకునేందుకు నిబంధనలు

యూఏఈ: అబుదాబీ అథారిటీస్, వాహనాల్ని అద్దె ప్రాతిపదికన ఒక గంట నుంచి అత్యధికంగా ఆరు గంటల వరకు వినియోగించుకునే విషయమై స్పష్టమైన నిబంధనల్ని పొందుపరిచారు. ఈ విధానం ద్వారా వినియోగదారులు తాము వున్న చోటనే కారుని అద్దె ప్రాతిపదికన పొంది, దాన్ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళవచ్చు. అయితే, డిపార్టుమెంట్ ఆఫ్ ఎకనమిక్ డెవలప్మెంట్ నుంచి అనుమతి పొందాలి. అలాగే ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్ట్ సెంటర్ నుంచి కూడా అనుమతి పొందాలి. ఆథరైజ్డ్ ప్రాంతాల్లో మాత్రమే వీటిని వినియోగించాలి. రిజిస్టర్ చేసుకున్న వినియోగదారుడే వాహనాన్ని నడపాలి. ట్రాఫిక్ ఇబ్బందుల్ని తగ్గించడానికి ఈ స్మార్ట్ విధానాన్ని తీసుకొచ్చారు. అందుబాటు ధరల్లో ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యాల్ని వినియోగదారులకు ఈ విధానం అందిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com